ఈ టైం లో నాకు కావాలనిపించిన కథ ఇది..ఆదిసాయికుమార్ సెప్టెంబర్ 6న విడుదలవుతున్న ‘జోడి’

551

వైవిధ్య మైన కథా,కథనాలతో వస్తున్న యూత్ పుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘జోడి’. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్చే స్తున్న హీరో ఆది, యుటర్న్, జెర్సీ సినిమాలతో సౌత్ లో క్రేజీ హీరోయిన్గా మారిన శ్రర్ద శ్రీనాథ్ హీరో, హీరోయిన్లుగా జోడి సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దం అయ్యింది. వందశాతం న్యాయం చేసే హీరో ఆది ఈ మూవీ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్రతో మెప్పించబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దం అవుతున్న సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ మాట్లాడుతూ…

ప్రొడ్యూసర్ విజయ లక్ష్మి: ‘ చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు నాచురల్ ఉండే సినిమా చేద్దామనే ఉద్దేశ్యంతో ఉన్నప్పుడు విశ్వ చెప్పిన కథ మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా పాత్రలు చాలా నాచురల్ గా ఉంటాయి. ఈ కథకు ఆది గారు అయితే బాగుంటుందని ఆయన్ని కలసి కథ చెప్పాము చెప్పగానే మా కథకు ఆయన ఒకే చెప్పారు. శ్రర్ద ఇప్పటికే ఆర్టిస్ట్ గా నిరూపించుకుంది. ఆమె ఈ సినిమాకు అసెట్ అనుకోవచ్చు. ఫణి మంచి మ్యూజిక్ ఇచ్చారు. డైలాగ్స్ కోసం చాలా టైం తీసుకొన్నాము, సినిమాలో డైలాగ్స్ బాగా వచ్చాయి. విశ్వ ఈ సినిమా కోసం పడిన తపన చాలా ఉంది. ఫైనల్ గా ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఈ ప్రయత్నానికి ప్రేక్షకులు ఆదరణ ఉంటుందని ఆశిస్తున్నాను’ అన్నారు.

దర్శకుడు విశ్వనాథ్ ఆరిగెల మాట్లాడుతూ: ‘ ఈ సినిమా ముగ్గురి నమ్మకంతో ముందుకు కదిలి ఇప్పుడు రిలీజ్ వరకూ వచ్చింది. అందులో ఒకరు ప్రొడ్యూసర్ విజయలక్ష్మిగారు కథ వినగానే అందులోని ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇది చెప్పాల్సిన కథ అని అన్నారు. ఈసినిమా కథ వినగానే ఇలాంటి కథ కోసమే నేను చూస్తున్నా అన్నారు. నరేష్ గారు పాత్ర కు చాలా బాగా వచ్చింది. సినిమాకు ఆ పాత్ర బలంగా మారుతుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఫణి నేను కొత్త ట్యూన్స్ కోసం చాలా డిస్కషన్స్ చేసాం . ఇప్పుడు ఆల్బమ్ బాగుంది అంటున్నారు. ఇందులో మాటలు, పాటలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ సినిమా కోసం నాతో ట్రావెల్ చేసిన ప్రతి టెక్నిషన్స్ కి థ్యాంక్స్ చెబుతున్నాను’ అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ: ‘నేను ఎప్పటి నుండో ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న మూవీ చేయాలనుకుంటున్నాను. అదే టైం విశ్వనాథ్ కథ చెప్పగానే నేను బాగా కనెక్ట్ అయ్యాను. విన్నప్పుడు కలిగిన ఫీల్ స్ర్కీన్ మీద మరింతగా పెరిగింది. శ్రర్ద చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ , తన యూటర్న్ మూవీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక చాలా మంది తెలిసిన వాళ్ళు కాల్ చేసి చాలా క్రొత్త గా ఉన్నావు అంటుటే చాలా హ్యాపీగా ఉంది. నరేష్ గారు సెట్ లో ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వండర్ పుల్ యాక్టర్ తో పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. వెన్నెల కిషోర్ నాకోస ఈ సినిమా చేసాడు చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ విజయలక్ష్మి గారు ఈ సినిమా కోసం చాలా ఎఫెర్ట్స్పె ట్టారు. సెప్టెంబర్ 6న రాబోతున్నాం, మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తాం అనే నమ్మకం ఉంది ’ అని అన్నారు.