“జయహో రామానుజ” టైటిల్ లోగో ఆవిష్కరణ

620

సుదర్శనం హేమలత సమర్పణలో సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ ప్రధాన పాత్రలో సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళీకలు నిర్మిస్తున్న రామానుజం జీవిత చరిత్రే  “జయహో రామానుజ”.ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది.ఈ కార్య క్రమానికిముఖ్య అతిథిలుగా వచ్చిన తిరుమలై కందాడై రామానుజ మఠం పీఠాధిపతి, జగద్గురు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణాచార్యులు గారు “జయహో రమానుజ” చిత్ర టైటిల్ లోగోను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోదండ రామాచార్యులు(తిరుమలై కందాడై రామానుజ మఠం ఉత్తర పీఠాధిపతి),టి.యఫ్.పి.సి ప్రధాన కార్యదర్శి మోహన్ వడ్ల పట్ల మరియు చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చిన

జగద్గురు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణాచార్యులు (తిరుమలై కందాడై రామానుజ మఠం పీఠాధిపతి) మాట్లాడుతూ.. ‘రామానుజం గారి జీవిత చరిత్ర తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఎందుకంటే మా మఠం కూడా తిరుమలై కందాడై రామానుజ మఠం.13 వ శతాబ్దంలో రామానుజం గారు తిరుపతి వచ్చినప్పుడు ఆయన స్థాపించినదే ఈ మఠం..అయన తిరుమలలో నాలుగు మఠం లను స్థాపించాడు.  ఆసూర్య మఠం, శ్రీ వస్తు మఠం, పరవస్తు మఠం, కందాడై మఠం లను స్థాపించి బ్రాహ్మణులను నాలుగు తెగలుగా విభజించాడు. వారే అయ్యర్, జీయర్, నంబి ,ఆచార్య. ఈ ఆచార్య మఠమైన తిరుమలై కందాడై రామానుజ మఠంకు ఆయన వారసున్నే మఠాధిపతి చేశారు. ఆయన పరంపరలో నేను 17వ పీఠాధిపతిని.ఈ మఠంకు 12 దేశాల్లో శాఖలున్నాయి. ఇలా మేము రామానుజన్ గారి గొప్ప తనాన్ని వారి జీవిత చరిత్రను తెలియజేస్తున్నాం.అయితే నటుడు, దర్శక, నిర్మాత సాయి వెంకట్ గారు రామానుజన్ గారి జీవిత చరిత్ర పై సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి మేము ఆయన గురించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.దీంతో ఆయన గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు ఈ సినిమా ద్వారా తెలుస్తాయి అని కోరుకుంటూ ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

కోదండ రామాచార్యులు(మూర్తి స్వామి) మాట్లాడుతూ.. రామానుజం స్వామి చరిత్ర తీసుకురావడానికి ఇప్పటి వరకు ఎవరు సాహసించలేదు. అటువంటిది ఇప్పుడు సాయి వెంకట చేస్తున్నారు ఈ “జయహో రామానుజ” చిత్రం మహోన్నతమైన గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

టి.యఫ్.పి.సి ప్రధాన కార్యదర్శి మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రం తీస్తున్న సాయి వెంకట్ కు ధన్యవాదాలు. ఆయనకు నేను సపోర్ట్ గా వుంటూ ఈ సినిమాకు నేను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు.

చిత్ర దర్శకుడు,నటుడు సాయి వెంకట్ మాట్లాడుతూ..మా “జయహో రామానుజ” టైటిల్ లోగో ఆవిష్కరణ కు విచ్చేసిన జగద్గురు శ్రీ శ్రీ లక్ష్మణ్ గారికి, మూర్తి స్వామికి, వేణుమాధవ్, మోహన్ వడ్లపట్ల గార్లకు ధన్యవాదాలు.నిర్మాతగా, దర్శకుడిగా, నటుడుగా తెలుగు ఫిలిం ఛాంబర్ లో వైస్ చైర్మన్ గా ఎన్నో ఆర్గనైజర్స్ లో పనిచేయడమే కాక  దర్శక సంఘంలో సెన్సార్ బోర్డు మెంబర్ గా ఇలా 22 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు తీశాను.ఆ తర్వాత ఫిబ్రవరి 25 మార్చి 15 వరకు తిరుపతిలో ఆ తర్వాత తమిళనాడు లోని శ్రీరంగం, కాంచి,పేరంబదుర్, బెంగళూర్లోని మేల్ కోటి ఇలా మూడు రాష్ట్రాల్లో షూటింగ్ చేయబోతున్నాం.ఈ సినిమాకు నేను దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఇలా అన్ని బాధ్యతలు తీసుకోలేను కాబట్టి నా ముగ్గురు కూతుర్లలో ఇద్దరమ్మాయిలు నిర్మాతలుగా బాధ్యతలు వ్యవహరించడం జరుగుతుంది. ఇంకొక అమ్మాయి పద్మ ను సింగర్ గా ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నాం.ఇలా మేము చేయబోతున్న “జయహో రామానుజ” సినిమాకు మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుతూ త్వరలో ఆడియో ఫంక్షన్ ను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.

నటి జో శర్మ మాట్లాడుతూ..  తెలుగమ్మాయి అయిన నేను అమెరికా లో చదువుకొని అక్కడ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్సు, యాక్టింగ్ పై  ఫ్యాషన్ ఉండటం వల్ల అక్కడే నేను డ్యాన్స్ & యాక్టింగ్ స్కూల్ ప్రారంభించాను. ఇంత మంచి ప్రాజెక్టు లో నేను చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. సాయివెంకట్ గారు నాకు చాలా గైడ్ గైడ్ లైన్స్ ఇచ్చారు.తను డైరెక్టర్ గా యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా చేయడం గొప్ప విషయం.నాకు ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మోహన్ వడ్లపట్ల గారికి, సాయి వెంకట గారికి ధన్యవాదాలు అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రవీణ్, అప్పం పద్మ ,అశ్వాపురం వేణు మాధవ్, తదితరులు పాల్గొని ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన రామానుజం గారి బయోపిక్ లోనటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.

నటీనటులు
లయన్ సాయి వెంకట్,జో శర్మ,అశ్వాపురం వేణు మాధవ్, అప్పం పద్మ తదితరులు

సాంకేతిక నిపుణులు
ప్రెజెంట్స్ : సుదర్శనం హేమలత
బ్యానర్ : సుదర్శనం ప్రొడక్షన్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టన్ : లయన్ సాయి వెంకట్
నిర్మాతలు : సుదర్శనం సాయి ప్రసన్న,సుదర్శనం ప్రవళీక
పి.ఆర్.ఓ : సతీష్