“జాతిరత్నాలు” ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది: నిర్మాత నాగ్ అశ్విన్

617


ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‘ వంటి హిట్ చిత్రంలో నటించి ‘చిచ్చోరే’తో బాలీవుడ్లో అడుగుపెట్టి మంచి పేరు సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జాతిరత్నాలు’‌. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్ గా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్ పతాకంపై అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమలు పూర్తిచేసుకొని మార్చి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేసింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ పోలిశెట్టి, నటుడు ప్రియదర్శి, హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా, నిర్మాత నాగ్ అశ్విన్, దర్శకుడు అనుదీప్ పాల్గొన్నారు..

హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, చిచ్చోరే తర్వాత నేను నటించిన మూడవ చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తున్నప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేశాను. వైజయంతి, స్వప్న సినిమాస్ బ్యానర్లో ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంక చాలా సపోర్ట్ చేసి ఈ సినిమా నిర్మించారు. కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. ప్రతీ ఒక్కర్నీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా.. థియేటర్స్ లోనే ఈ చిత్రం విడుదలవ్వాలి, ఆడియెన్స్ కి ఒక కొత్త ఎక్స్ పీరియెన్స్ ఇవ్వాలి.. అని నిర్మాతలు ఈ చిత్రాన్ని థియేటర్స్ లలో మార్చి 11న రిలీజ్ చేస్తున్నారు. “చిట్టి” సాంగ్ పెద్ద హిట్ అయి వైరల్ అవుతోంది. టీజర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. ప్రతీ డైలాగ్ ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం” అన్నారు.

నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “అనుదీప్ షార్ట్ ఫిల్మ్ చూశాను. అది చాలా యూనిక్ కామెడీతో నాకు బాగా నచ్చింది. ‘మహానటి’ టైంలో అనుదీప్ కలిశాడు. పూర్తి కామెడీ తరహా స్క్రిప్ట్ చెప్పాడు. వినేటప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేశాను. కంప్లీట్ ఇది అనుదీప్ చిత్రం. నా ఇన్వాల్వ్ మెంట్ ఏమీ లేదు.. వెంటనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ప్రియాంక, స్వప్న సపోర్ట్ తో చాలా జాగ్రత్తగా చేశాం. నాకు జంధ్యాల, ఈవివి, యస్వీ కృష్ణారెడ్డి గారి చిత్రాలు అంటే బాగా ఇష్టం. వాళ్ళ సినిమాలు ఇప్పటికీ యూట్యూబ్ లో చూసినా పెదవిపై ఒక చిరునవ్వు వస్తుంది. అలాంటి ఫన్ ఫిల్మ్ ఈ ‘జాతిరత్నాలు’. ఎంత కష్టపడి కామెడీ చేసినా ఒక్కోసారి అంతగా పండదు.. ఇంకోసారి నేచురల్ గా చేసినా బాగా పండుతుంది. ఇది రెండో జోనర్ కి చెందుతుంది. ఒక స్పెషల్ ప్రొడక్ట్ ‘జాతిరత్నాలు’ను ప్రేక్షకులకు అందిస్తున్నాం. సెటైరికల్ సినిమా. ప్రతి క్యారెక్టర్లో యూనిక్ నెస్ ఉంటుంది. ఇట్స్ ఏ ఔట్ అండ్ కామెడీ బేస్డ్ ఫిల్మ్.. అందరికీ బాగా నచ్చుతుందని హోప్ తో ఉన్నాం” అన్నారు.

దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. “టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఒక పూర్తి వినోదభరిత చిత్రం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. స్వప్న సినిమాస్ బ్యానర్లో సినిమా చేయడం గ్రేట్ ఆనర్ గా ఫీలవుతున్నాను. నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంక ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. వారికి నా స్పెషల్ థాంక్స్” అన్నారు.

నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. “స్క్రిప్ట్ విన్నప్పుడే నాన్ స్టాప్ గా నవ్వుతూనే వున్నాను. ప్రేక్షకులు కూడా రెండుగంటల పాటు సినిమా చూసి నవ్వుతూనే వుంటారు. కామెడీని చాలా డిఫరెంట్ గా చూపించారు డైరెక్టర్ అనుదీప్. సినిమా చాలా బాగా వచ్చింది. అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. “చిట్టి” పాటకు 13 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి విశ్వరూపం చూస్తారు. మార్చి 11న సినిమా విడుదలవుతుంది.. ప్రేక్షకులందరు థియేటర్స్ లో నవ్వుతూ గోల చేస్తారు. రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాం” అన్నారు.

హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా మాట్లాడుతూ.. “ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అయినా అలా అనిపించలేదు. టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. నాగ్ అశ్విన్, ప్రియాంక బాగా ఎంకరేజ్ చేశారు. సెట్లో ఫుల్ జోష్ తో షూటింగ్ చేశాం. పెద్ద బ్యానర్లో నా మొదటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385