మార్చి 11న జాతి రత్నాలు చూసి ఎంజాయ్ చేయండి – విజ‌య్ దేవ‌రకొండ‌

407

నవీన్ పోలిశెట్టి – రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ‘జాతిరత్నాలు`. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నిర్మాత‌గా ప‌రిచ‌య మ‌వుతున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్బంగా జాతి ర‌త్నాలు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వ‌రంగ‌ల్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా హాజ‌రై జాతిర‌త్నాలు బిగ్ టికెట్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీగా అభిమానులు హాజ‌రై ఈవెంట్‌ని గ్రాండ్ స‌క్సెస్ చేశారు.

క్రేజీ హీరో విజయ్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. ‘కాకతీయ.. వరంగల్.. ఇక్కడున్న ప్రతీ ఒక్కరికీ.. అక్కడున్న ప్రతీ ఒక్కరికీ.. మీ అందరూ కనిపిస్తున్నారు.. ఐ లవ్యూ ఆల్.. ఈ రోజు మార్నింగ్ నాగీ నుంచి మెసెజ్ వచ్చింది.. సినిమా పూర్తి అయింది.. నువ్ త్వరగా రావాలి అన్నాడు.. ఇక్కడికి రావడం నాకెంతో సంతోషంగా ఉందని అన్నాను.. ఇంత మందిని కలిసే అవకాశం వచ్చింది.. ఏడాది నుంచి మీ అందరినీ చూడలేదు.. ఈరోజు నేను నటుడిని కాలేకపోయినా ఇక్కడకి వచ్చేవాడిని.. మీలా అక్కడ కూర్చుని చూసేవాడిని..   మధ్య మధ్యలో అనుదీప్ షార్ట్ ఫిలిమ్ చూపించి నవ్వించేవాడు.. ఫరియా ఎంతో ఎనర్జీతో నటించావ్.. నీ జర్నీ కూడా మాలానే మొదలైందని విన్నాను. మా అందరి కంటే మంచి నటిలా ఉన్నావ్.. మా మొదటి సినిమాలో నీ అంత యాక్టింగ్ చేయలేదు.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నన్ను నటుడిగా వైజయంతీ మూవీస్ లాంచ్ చేసింది.. ఇలా ఫ్రెండ్స్ అందరితో స్టేజ్ షేర్ చేసుకోవడం.. కన్న కలలన్నీ కూడా నిజం కావడం ఎంతో గొప్పగా ఉంది.. మార్చి 11న జాతి రత్నాలు.. వెళ్లండి.. చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు

నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. హలో వరంగల్ థ్యాంక్యూ.. అందరూ కనిపిస్తున్నారు.. మాస్క్‌లు వేసుకుని అందరూ జాగ్రత్తగా ఉండండి.. ఈ సినిమాను సంవత్సరం పాటు రిలీజ్ చేయకుండా ఉంచుకున్నాం.. ఇలాంటి ఫీలింగ్ కోసమే రెండేళ్లు మా దగ్గరే పెట్టుకున్నాం.  . ఇక డైరెక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సినిమా కోసం పని చేసిన వారందరి గురించి నాగ్ అశ్విన్ వివరించారు.

నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో మొదలైన ప్రయాణం.. ఈ జాతిరత్నాలు వరకు వచ్చింది.. ప్రభాస్ అన్నతో డార్లింగ్ రత్నాలు అయ్యింది.. ఇప్పుడు విజయ్ రావడంతో డార్లింగ్ రౌడీ రత్నాల ఫ్యామిలీలా మారిపోయింది. ఎక్కడో యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని.. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం.. . థియేటర్లో ప్రేక్షకులు నవ్వుకుంటూ ఉంటే చూడాలని ఎంతో భద్రంగా కాపాడారు. ఎన్ని కష్టాలున్నా ఓ ఐదు నిమిషాలు నవ్వుకుంటే.. లైఫ్ నేను అనుకున్నంత బ్యాడ్‌గా లేదేమో అనే ధైర్యాన్ని నవ్వు ఇస్తుంది.. ఆ నవ్వును మీకు పంచేందుకు మార్చి 11న మేం వస్తున్నాం.. జాతి రత్నాలు సినిమాతో ఎంజాయ్ చేద్దామ’ని అన్నారు.

దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. హాయ్ వరంగల్ అందరికీ నమస్కారం.. మార్చి 11న సినిమా రిలీజ్.. మీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.. నవీన్ టైంకు సెట్‌కు వచ్చేవాడు. ఫరియా బాగా నటించింది.. నాగ్ అశ్విన్ కథకు చెప్పిన తరువాత ఫుల్ చిల్లరగాళ్లుకావాలని చెప్పాను.. ముందు నవీన్ పేరు చెప్పాను.. తరువాత రాహుల్. దర్శి పేర్లు చెప్పాను.. డీసెంట్ డైరెక్టర్ కావాలని నేను ఉన్నాను. నిర్మాతలు రెండూ మిక్స్ అయి ఉండాలి.. మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ మాస్ కావాలని రధన్‌ను తీసుకున్నామ’ని సరదాగా నవ్వులు పూయించారు.

ప్రియదర్శి మాట్లాడుతూ.. ఇదొక హిస్టారిక్ మూమెంట్. చరిత్రలో నిలిచేపోయే ఘట్టం.. మేమంతా మీలాంటివాళ్లమే.. మాస్ గాళ్ల దగ్గరి నుంచి వచ్చినా మా లాంటి వాళ్లకు చాన్స్ ఇచ్చినందుకు వైజయంతికి, స్వప్నా మూవీస్‌కు థ్యాంక్స్.. మేమే వచ్చామంటే.. మీలోంచి ఇంకెంత మంది వస్తారు’ అని అన్నారు.

రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. మా వాడు(ప్రియదర్శి) చెప్పినట్టు నేను అంత సోది చెప్పను.. కానీ మీరంతా విజయ్ దేవరకొండ గురించి ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.. అంతకు ముందు స్వ డబ్బా.. పరస్పర డబ్బా కొట్టుకోకుండా ఓ పది ముచ్చట్లు చెబుతా.. ఈ సినిమా చూస్తున్నంత సేపు కచ్చితంగా సీట్లు చింపుకుంటూ నవ్వుతూనే ఉంటారు.. ఒక వేళ్ల నవ్వకుంటే మా ఇంటికి రండి.. మళ్లీ నవ్విస్తాను’అని ముగించాడు. మళ్లీ ప్రియదర్శి అందుకుని..‘మాస్క్ పెట్టుకుని రండి.. మిమ్మల్ని నవ్వించే బాధ్యత మాది’ అని అన్నారు.

హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా మాట్లాడుతూ.. “ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అయినా అలా అనిపించలేదు. టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. నాగ్ అశ్విన్, ప్రియాంక బాగా ఎంకరేజ్ చేశారు. సెట్లో ఫుల్ జోష్ తో షూటింగ్ చేశాం. పెద్ద బ్యానర్లో నా మొదటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి భారీగా అభిమానులు హాజ‌రై ఈవెంట్‌ని గ్రాండ్ స‌క్సెస్ చేశారు.