శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మారెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం జనవరి 29న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, దర్శకుడు సముద్ర, నటులు శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్, రచయిత చందు, కో ప్రొడ్యూసర్స్ శిరీష్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు…
నటుడు సునీల్ మాట్లాడుతూ – “నా స్కూల్ డేస్‌లో ఏదైనా సినిమాకి వెళ్తాను అంటే ఆదివారం పూట టి.కృష్ణగారి రేపటిపౌరులు, నేటి భారతం వంటి సినిమాలకి తీసుకెళ్లేవారు. ఎందుకంటే ప్రస్తుత సమాజం ఎలా ఉంది?. ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కోంటున్నారు? అని తెలుస్తాయని. అలా తెలుసుకోవడం చాలా అవసరం. మా తాత గారు ఒక రైతు. నేను చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లకపోతే నన్ను పొలం దగ్గరకు తీసుకెళ్లేవారు. ఒక రైతుకు మన అవసరం లేకున్నా.. మనందరికీ రైతు అవసరం తప్పకుండా ఉంటుంది.అందుకని వారి సమస్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ ఐపీయస్ ఆఫీసర్‌గా నటించడం జరిగింది. నా క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. జనరల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేస్తుంటాం..కాని ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం చాలా రేర్‌గా వస్తుంది. రైతుల సమస్యలని పదిమందికి చెబుతూ ఒక మంచి పరిష్కారాన్ని చూపించడం చాలా గొప్ప విషయం. ఒక మంచి ఆశయంతో తీసిన సినిమా కాబట్టి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ – “మా జైసేన సినిమా జనవరి 29న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆ భగవంతున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో మా అన్నయ్యలు సునీల్‌గారు, శ్రీకాంత్‌గారు, నా బెస్ట్ ఫ్రెండ్ తారకరత్న, శ్రీరామ్, శ్రీ, కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్ నటించారు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. సునీల్ గారు ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఆయన పొలీసుగా చేసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. జైసేన అనగానే అందరికీ జనసేన అన్నట్టుగా వినపడుతుంది. అది నిజమే ఎందుకంటే జనసేన అనేది పవన్‌కళ్యాణ్ గారి పార్టీ మేమందరం దాన్ని అభిమానిస్తాం అలాగే జైసేన సినిమా పవన్‌కళ్యాణ్ గారి భావాలకు దగ్గరిగా ఉండే సినిమా. అలాగే రైతుల సమస్యల గురించి సినిమాలో ఈ చర్చించడం జరిగింది. రైతులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి పరిష్కారాన్ని కూడా ఈ మూవీలో చూపించాం. అందుకే ఈ సినిమాని రైతులకి అంకితం చేస్తున్నాం. రైతులకి సపోర్ట్ అందించడం మనందరి భాధ్యత అని చెప్పే సినిమా. రైతుల కోసం తీసిన కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాకి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో ప్రవీణ్ మాట్లాడుతూ – “సముద్ర గారు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా నా లైఫ్‌కు ప్లస్ అవుతుందని నమ్ముతున్నాను. ఇంత గొప్ప జర్నీలో నన్ను భాగం చేసిన సముద్ర గారికి ధన్యవాదాలు“ అన్నారు.
హీరో అభిరామ్ మాట్లాడుతూ – “జనవరి 29న మీముందుకు వస్తున్నాం. మా తొలి ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను, మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్“ అన్నారు.
కో ప్రొడ్యూసర్స్ శిరీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – “మా టీమ్ అందరూ ఎంతో కష్టపడి తీసిన జైసేన సినిమా జనవరి 29 విడుదలవుతున్నందుకు హ్యాపీగా ఉంది. రైతుల మీద మంచి సబ్జెక్ట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం“ అన్నారు.
రైటర్ చందు మాట్లాడుతూ – “జైసేన మనకు అన్నం పెట్టే రైతు గురించి సముద్రగారు ప్రాణం పెట్టి తీసిన సినిమా. మనకు విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం ఉంటుంది కాని రైతులకి విశ్రాంతి అనేదే ఉండదు. పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అలాగే జంతు సంరక్షణ కోసం కొన్ని పెద్ద సంస్థలు ముందుకు వచ్చాయి. అలాగే రైతులకి కూడా ఒక క్లీన్ పోలీసింగ్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది“ అన్నారు.
శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్‌గౌతమ్ పరిచయం అవుతున్నారు. శ్రీరామ్, అజయ్ ఘోష్, మధు, ఆజాద్, ధనరాజ్, వేణు, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: వాసు, సంగీతం: ఎస్. రవిశంకర్, ఎడిటింగ్: నందమూరి హరి, మాటలు: తిరుమల శెట్టి సుమన్, పారవతిచంద్, పాటలు: అభినయ్ శ్రీను, సిరాశ్రీ, డ్యాన్స్: అమ్మారాజశేఖర్, అజయ్, ఫైట్స్: కనల్ కన్నన్, నందు, రవివర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.ఆర్. చంద్రయాదవ్, లైన్ ప్రొడ్యూసర్: వి. గోపాల కృష్ణ. కో ప్రొడ్యూసర్స్: పి.శిరీష్ రెడ్డి, దేసినేని శ్రీనివాస్, సమర్పణ: విజయలక్ష్మి, నిర్మాత: వి.సాయి అరుణ్ కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.