HomeTeluguస్వ‌ప్న సినిమా `జాతిర‌త్నాలు` ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌

స్వ‌ప్న సినిమా `జాతిర‌త్నాలు` ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌


నేష‌న‌ల్ అవార్డ్‌ను సొంతం చేసుకున్న `మ‌హాన‌టి` బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ `జాతిర‌త్నాలు`.`మ‌హాన‌టి` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శ‌కుడు నాగ్అశ్విన్ ఈ చిత్రంతో నిర్మాత‌గా మారుతున్నారు. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. అనుదీప్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ జైలు ఖైదీల దుస్తుల్లో క‌న‌ప‌డుతున్నారు. 420, 210, 840 వారి నెంబ‌ర్స్‌గా క‌న‌ప‌డుతున్నాయి. . న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుండ‌టంతో సినిమాపై మంచి క్రేజ్ నెల‌కొంది.
`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` సినిమాతో హీరోగా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సొంతం చేసుకున్న న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టిస్తుండ‌గా ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కాంబినేష‌న్ `బ్రోచెవారెవురురా` త‌మ‌దైన కామెడీతో మెప్పించారు. సినిమా ఇప్ప‌టికే 75 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ర‌ధ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. సిద్ధాన్ మ‌నోహ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, ఫ‌రియా అబ్దుల్లా, ముర‌ళీశ‌ర్మ‌, వి.కె.న‌రేశ్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల కిషోర్‌, మిర్చి కిర‌ణ్, గిరిబాబు, మహాన‌టి ఫేమ్ మ‌హేష్‌

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనుదీప్ కె.వి
నిర్మాత‌: నాగ్ అశ్విన్‌
బ్యాన‌ర్‌: స్వ‌ప్న సినిమా
కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్ష గార‌పాటి
మ్యూజిక్‌: ర‌ధ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: సిద్ధాన్ మ‌నోహార్‌
ఎడిట‌ర్‌: అభిన‌వ్ దండ‌
ఆర్ట్‌: చ‌ంద్రిక‌.జి, ఫైస‌ల్ అలీ ఖాన్‌

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES