HomeTeluguఐరా క్రియేషన్స్ - నాగ శౌర్య - ప్రొడక్షన్ నెం. 3 "అశ్వథ్థామ" ఫస్ట్ లుక్...

ఐరా క్రియేషన్స్ – నాగ శౌర్య – ప్రొడక్షన్ నెం. 3 “అశ్వథ్థామ” ఫస్ట్ లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రీన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా రూపొందిస్తున్న ప్రొడ‌క్ష‌న్ నెం 3 చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ దీపావళి పండగ సందర్భంగా సంస్థ కార్యాలయంలో గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రానికి అశ్వథ్థామ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం. పలు సూపర్ హిట్ చిత్రాలుకు మ్యాజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. మనోజ్ రెడ్డి డీఓపీగా పరిచయం అవుతున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉషా ముల్పూరి మాట్లాడుతూ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఛలో సెంటిమెట్ తో ఈరోజు మీడియాను కలుసుకున్నాం. ఈ సందర్భంగా ఐరా క్రియేషన్స్ నాగశౌర్య ప్రొడక్షన్ నెం.3 చిత్రానికి అశ్వథ్థామ అనే టైటిల్ ఎనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు నాగశౌర్య ఈ తరహా కథ, కథనంతో సినిమా చేయలేదు. అందుకే ఫస్ట్ లుక్ ను విభన్నంగా ఉండేలా ప్లాన్ చేశాం.

చిత్ర సమర్పకుడు శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ… ఈ చిత్రంతో డైరెక్టర్ గా రమణ తేజ పరిచయం అవుతున్నాడు. అమెరికాలో వర్క్ చేశాడు. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నాగశౌర్య రియలిస్టిక్ స్టోరీని కథగా మలిచాడు. దాన్ని అనుకున్నట్టుగా తెరకెక్కిస్తున్నాడు. రియలిస్టిక్ సినిమా ఇది. సాంగ్ బ్యాలెన్స్ ఉంది. చిక్ మంగుళూరులో షూట్ ప్లాన్ చేశాం. దాదాపు 30 రోజులు యాక్షన్ షూట్ చేశాం. కెజిఎఫ్ కి స్టంట్స్ చేసిన అన్బు అరివు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కథ నచ్చి మా సినిమాకు వర్క్ చేశారు. ఎడిటర్ గ్యారీ మాతో 60 రోజులు సెట్లో ఉండి ఎడిటింగ్ చేశారు. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.

రమణ తేజ – ఇది ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. శౌర్య గారు రియల్ ఇన్సిడెంట్స్ నుంచి రాసుకున్నారు. నన్ను డైరెక్టర్ గా అనుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐరా క్రియేషన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నాకు కష్టం లేకుండా చేశారు. శౌర్య గారికి కాలుకు దెబ్బ తగిలింది. ఆయన డూప్ లేకుండా యాక్షన్ చేశారు. హీరో అంతగా ఇన్ వాల్వ్ అయ్యారు. నేను అమెరికాలో బోస్టన్ ఫిల్మ్ స్కూల్ లో చదువుకున్నాను. బుజ్జి గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎడిటిర్ గ్యారీ షూటింగ్ స్పాట్

న‌టీన‌ట‌లు..
నాగశౌర్య, మెహరీన్, పోసానికృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, ప్రొయ‌ర‌మ‌ణ‌, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్క‌ర్

సాంకేతిక వ‌ర్గం
మ్యూజిక్ః శ్రీ‌చ‌ర‌ణ్‌,
కెమెరాః మ‌నోజ్‌రెడ్డి,
ఎడిట‌ర్ : ‌గారీ బిహెచ్‌,
ఆర్ట్‌డైరెక్ట‌ర్ః కిర‌ణ్‌కుమార్ మ‌న్నే,
కొరియోగ్రాఫర్ః ర‌ఘుమాస్ట‌ర్‌,
ఫైట్స్.. అన్బు అరివు
స్టోరీ- నాగ‌శౌర్య‌,
స్క్రీన్ ప్లే- ర‌మ‌ణతేజ‌, ఫ‌ణీంద్ర‌బిక్కిన‌,
లైన్ ప్రొడ్యూసర్ – బుజ్జి
డైరెక్ష‌న్- ర‌మ‌ణ్‌తేజ‌,
ప్రొడ్యూస‌ర్ – ఉషాముల్పూరి,
పిఆర్ ఓ – ఏలూరుశ్రీ‌ను.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES