HomeTeluguపాటల పల్లకిలో ఐక్యూ

పాటల పల్లకిలో ఐక్యూ


మధ్య తరగతికి చెందిన ఓ అమ్మాయి తన తెలివితేటలతో ప్రపంచస్థాయి గుర్తింపు ఎలా తెచ్చుకుంది? అనే కథాంశంతో ఐక్యూ సినిమా తెరకెక్కుతోంది. కాలేజ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఐక్యూ’ చిత్రంలో కాయగూరల సాయిశరణ్‌, పల్లవి, ట్రాన్సీ హీరో హీరోయిన్లు. శ్రీనివాస్‌ జిఎల్‌బి దర్శకుడు. కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేశారు. డబ్బింగ్‌ కూడా పూరికావడంతో రీ రికార్డింగ్‌ జరుపుతున్నారు. ఈ చిత్రం పాటలను ఇదేవారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
‘ఐక్యూ’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌, అనంతపూర్‌లో జరిగింది. ఈ సినిమా టీజర్‌ ఫస్ట్‌లుక్‌, పోస్టర్‌ ఇప్పటికే విడుదల చేశారు. నవంబర్‌లో సినిమా విడుదల చేస్తామని” శ్రీనివాస్‌ జిఎల్‌బి ఈ సందర్భంగా తెలిపారు. ” సినిమా చూసిన యువతకు ప్రేరణ కలిగించే అంశాలు ఇందులో ఉన్నాయి ” అని చెప్పారు. ఇతర పాత్రల్లో సుమన్‌, సత్యప్రకాష్‌, సూర్య, గీతాసింగ్‌, బెనర్జీ తదితరులు నటిస్తున్రు.
ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం ఘటికాచలం, ఛాయాగ్రహణం టి.సురేంద్రరెడ్డి.


PRO:Murthy
+91-9912656005

RELATED ARTICLES

LATEST ARTICLES

Dear Uma Movie Review

ALL CATEGORIES