దోచేవారెవరురా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది : దర్శకులు శివనాగేశ్వరరావు !!!

235

IQ క్రియేషన్స్ పతాకంలో మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు నూతన నటీ నటులతో, బొడ్డు కోటేశ్వరరావుగారు రూపొందిస్తున్న సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం దోచేవారెవరురా.. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్కుని షూటింగ్ దశలో ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా దర్శకులు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ… దోచేవారెవారురా సినిమా అనుకున్నదానికన్నా చాలా బాగా వస్తుంది, క్వాలిటీ పరంగా, నిర్మాణ పరంగా ఎక్కడ రాజి పడకుండా నిర్మాతలు సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్, టీజర్ మరియు ట్రైలర్ విడుదల చేయబోతున్నాము. సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము, ఈ సినిమా అందరికి కనెక్ట్ అయ్యేలాగా, నచ్చేలాగా ఉంటుంది అన్నారు.

దర్శకులు: శివ నాగేశ్వరరావు
నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
నిర్మాణం: IQ క్రియేషన్స్

పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్