సోహ్లా ప్రొడక్షన్స్ , చేతన్ రాజ్ ఫిలిమ్స్ ఇంట్రో ఆఫ్ కృష్ణ‌లంక

771

రంగు సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర‌ను వేసిన కార్తికేయ ద‌ర్శ‌క‌త్వంలో పరుచూరు రవి, నరేష్ మేడి,ఆదర్శ్,పెద్దిరాజు, ప్రతీక్ష,అనిత భట్ నటీనటులుగా సోహ్లా ప్రొడక్షన్స్ , చేతన్ రాజ్ ఫిలిమ్స్ లు కలసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం కృష్ణలంక. నిర్మాత పూనా సోహ్లా పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇంట్రో ఆఫ్ కృష్ణ‌లంక వీడియోని విడుద‌ల చేసింది టీం. టీజ‌ర్ లు, ట్రైల‌ర్ ల‌కు భిన్నంగా ప్ర‌తి క్యారెక్ట‌ర్ యెక్క ఎమోష‌న్ ని ప‌లికించిన ఈ మూడు నిముషాల వీడియో లో అన్ని పాత్ర‌లు తీరు తెన్నుల‌ను ప‌రిచ‌యం చేసాడు ద‌ర్శ‌కుడు. హైటెక్నిక‌ల్ వాల్యూస్ తో నిర్మించిన కృష్ణ‌లంక, ప్రేమ‌కు ప‌గ‌కు మ‌ద్య జ‌రిగే యుద్దాన్ని ప‌రిచ‌యం చేసింది. ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రావు కుమారుడు ప‌రుచూరి ర‌వి పాత్ర ఈ సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. అంతా కొత్త వారితో కార్తికేయ ఈ సినిమాను మ‌లిచిన తీరు అంద‌రూ ప్ర‌శంశ‌లు కురిపిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ అయిన ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కార్తికేయ మాట్లాడుతూః
ఇది ఎమోష‌న‌ల్ క్రైమ్ డ్రామా… ప్రేమ‌, స్నేహాం , ప‌గ వంటి భావోద్వేగాల‌తో న‌డిచే ఈక‌థ‌లో ప్ర‌తి పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. చాలా రియ‌లిస్టిక్ గా క‌థ‌నం ఉంటుంది. హీరోయిన్ క్యాట‌లిన్ పాత్ర చాలా ఎమోష‌న‌ల్ గా ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్ట‌ర్ చుట్టూ క‌థ‌నం సాగుతుంది. ఇందులో హీరోలుగా చేసిన న‌రేష్, ఆద‌ర్శ్ పెద్దిరాజు పాత్ర‌లు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. ప‌రుచూరి ర‌వి పాత్ర లో ఉండే మాస్ అప్పీల్ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఇంట్రో ఆఫ్ కృష్ణ‌లంక లో సినిమాలో ప్ర‌తి పాత్ర ను ప‌రిచ‌యం చేయ‌డం జ‌రిగింది. ఆ పాత్ర తాలూకు ఎమోష‌న్ ని చూపించాం.. ఈ సినిమా మ్యూజిక్ కృష్ణ సౌర‌భ్ అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎమోష‌న్ ని ఎలివేట్ చేసాడు. క‌థ‌, క‌థ‌నాలు చాలా రియ‌లిస్టిక్ గా ఉంటాయి. ప‌రిచూరి బ్ర‌ద‌ర్స్ నాకు గాఢ్ పాద‌ర్ లాంటి వారు.. ఈక‌థ చెప్ప‌గానే ప‌రుచూరి వెంకటేశ్వ‌రావు గారు ఇచ్చిన ప్రోత్సాహాం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. కొన్ని డైలాగ్స్ వారు మాత్ర‌మే రాయ‌గ‌ల‌రు అనేంత‌గా వ‌చ్చాయి. కృష్ణ‌లంక ప్ర‌తి ఎమోష‌న్ ని పీక్స్ లో చూపిస్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అన్నారు..

నిర్మాత పూనా సోహ్లా మాట్లాడుతూః
కృష్ణ‌లంక సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా మా అంచ‌నాల‌ను మించి వ‌చ్చింది. ఒక మంచి సినిమా ను నిర్మించామ‌న్న సంతృప్తి ఉంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాము. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చ‌క్క బ‌డిన త‌ర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం అన్నారు…

మ‌రో నిర్మాత చేత‌న్ మాట్లాడుతూః
ఇంట్రో ఆఫ్ కృష్ణ‌లంక తో మా సినిమాను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసాము.. ప్రేక్ష‌కులు ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కార్తికేయ క‌థ‌ను డీల్ చేసిన విధానం మాకు బాగా న‌చ్చింది. క‌థ‌లోని భావోద్వేగాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి.. కృష్ణ‌లంక సినిమా నిర్మించాక తెలుగులో మ‌రిన్ని సినిమాలు తీయాల‌నిపిస్తుంది. అన్నారు..

బ్య‌న‌ర్స్
సోహ్లా ప్రొడక్షన్స్ , చేతన్ రాజ్ ఫిలిమ్స్
సినిమాటోగ్ర‌ఫీ ః శ్రీమాన్ నారాయ‌ణ‌
ఎడిట‌ర్ః కుమార్ తేజ‌
మ్యూజిక్ ః కృష్ణ సౌర‌భ్ సూరం ప‌ల్లి
విఫె క్స్ ః దిలీప్ తేజ‌
డైలాగ్స్ ః ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః సూర్య సూర్యాని
కథ, కథనం, ద‌ర్శ‌క‌త్వం ః వి.కార్తికేయ

నిర్మాత‌లుః పూనా సోహ్లా, చేత‌న్

న‌టీ న‌టులుః పరుచూరు రవి, నరేష్ మేడి,ఆదర్శ్,పెద్దిరాజు, కృష్ణ‌, క్యాట‌లిన్ , ప్రతీక్ష,అనిత భట్, టార్జ‌న్ , చేత‌న్, భ‌వ‌దీప్ పాటిల్, క‌ట్ట‌శివ‌ త‌దిత‌రులు..