లయన్‌ వై.కిరణ్‌కు'[ఇండియా అఛీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం…

423


నగరానికి చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సుచిర్‌ ఇండియా సిఇఒ, లయన్‌ వై.కిరణ్‌కు పవర్‌ కారిడార్స్‌ అందించే ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. నిర్వహిస్తున్న వ్యాపార, వాణిజ్య, పరిశ్రమకు సంబంధించి సాహసోపేత, వైవిధ్యభరిత ధోరణుల ఆవిష్కరణ వంటి అంశాల్లో కిరణ్‌ సేవలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో సుచిర్‌ ఇండియా సిఇఒ, లయన్‌ వై.కిరణ్‌కు హెచ్‌ఆర్‌డి మినిస్టర్‌ ఇండియా అఛీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారాన్ని అందజేశారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి రమేష్‌ పోక్రియాల, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మురళీ మనోహర్‌ జోషి, సినీనటి, సామాజిక కార్యకర్త శిల్పా శెట్టి, బాలీవుడ్‌ సినీనటుడు సురేష్‌ ఒబెరాయ్, మాజీ ఛీఫ్‌ జస్టిస్‌ కెజి బాలకృష్ణన్, కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్‌ వ్యవహరాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌… తదితరులు హాజరయ్యారు.