“ఇందువదన” రిటర్న్ గిఫ్ట్ ఉచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు..చిత్ర నిర్మాతలు

632

నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం “ఇందువదన”. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ ను చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందించగా.. శివ కాకాని సంగీతం సమకూర్చారు. నూతన సంవత్సర శుభా కాంక్షలుతో జనవరి 1న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్స్‌ లో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది.ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో

చిత్ర నిర్మాత మాధవి ఆదుర్తి మాట్లాడుతూ.. రోజు రోజు కు మా “ఇందువదన” సినిమాకు ప్రేక్షకుల నుండి ఆదరణ, కలెక్షన్స్ పెరుగుతుండడంతో థియేటర్స్ ను పెంచు తున్నాము.ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాతో వర్క్ చేసిన వరుణ్, ఫర్నాజ్ లకు ధన్యవాదాలు మొదటిసారిగా ఎంతో ప్యాసినెట్ గా వచ్చిన మేము మంచి చిత్రం తీయాలని ప్రొడక్షన్స్ లోకి వచ్చాము. సతీష్ ఆకేటి గారిచ్చిన మంచి కథను యమ.యస్.ఆర్. చాలా చక్కగా తీశాడు.వరుణ్ గారు ఈ కథ విన్న తరువాత ఈ బ్యానర్ లో వస్తున్న ఫస్ట్ మూవీ అని చూడకుండా మేము ఏ లోకేషన్ కు రమ్మన్నా అక్కడకు వచ్చి ఫుల్ సపోర్ట్ చేశారు.చాలా సంతోషంగా ఉంది అన్నారు.

చిత్ర దర్శకుడు యమ్.యస్.ఆర్ మాట్లాడుతూ.. ఇందువదన సినిమాను హిట్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు.ముందుగా ఈ కథను సతీష్ ఆకెటి గారు చెప్పిన తరువాత నచ్చడంతో చిన్న చిన్న మార్పులు చేసిన తరువాత శ్రీ బాలాజీ పిక్చర్స్ శ్రీమతి మాధవి ఆదుర్తి గారు మా కథను ఒకే చేశారు.నేను కొత్తవాన్ని అయినా కూడా నా మీద నమ్మకం తో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు చిత్ర నిర్మాతలు వారికి నా ధన్యవాదాలు.

హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి మాట్లాడుతూ..ఇలాంటి మంచి సినిమాలో నాకింత ఇంపార్టెంట్ రోల్ ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు.కో యాక్టర్ వరుణ్ గారు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు.శివ కాకాని గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.సినిమాటోగ్రఫర్ ఇందులో నన్ను చాలా బాగా చూయించారు.సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతున్న మా సినిమాను ఇంకా పెద్ద విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుతున్నాను అన్నారు.