దిల్ రాజు చేతుల మీదుగా “ఇక్షు” ట్రైలర్ లాంచ్

348

డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు నిర్మిస్తున్న చిత్రం “ఇక్షు”:మేము విడుదల చేసిన “ఇక్షు” ప్రోమోకు సినీ పెద్దలనుండి, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 16 న ఐదు భాషల్లో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు, నిర్మాతలు దిల్ రాజు, బేక్కం వేణుగోపాల్, దామోదర్ ముఖ్య అతిధులుగా వచ్చారు. నిర్మాత దిల్ రాజు చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర దర్శకురాలు వివి ఋషిక మాట్లాడుతూ..దిల్ రాజు గారు వచ్చి మా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వారికీ ధన్యవాదములు. అలాగే నాకు ఇండస్ట్రీ కొత్త అయినా సురేష్ కొండేటి గారు ఫుల్ సపోర్ట్ చేశారు.ఇలాంటి అవకాశం కోసం నేను చాలా సంవత్సరాల నుండి ఎదురు చూశాను. సిద్ధం మనోహర్ ఇచ్చిన కథ నచ్చిడంతో ఈ కథకు దర్శకత్వం వహిస్తున్నాను .ఈ చిత్రానికి రామ్ అగ్నివేష్, రేఖ నిరోషా లను హీరో హీరోయిన్స్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తరువాత మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకొన్నాము .ఇందులో హీరో రామ్ చాలా చక్కగా నటించాడు. తను ఎంత పెద్ద డైలాగ్ నైనా ఈజీగా చెప్పగల మంచి ఆర్టిస్టు. అలాగే హీరోయిన్ రేఖ కూడా చాలా బాగా నటించింది.మరియు ఫిదా కు ఈ చిత్రం ద్వారా మంచి నటిగా పేరోస్తుంది. చిత్రం శ్రీను నా తమ్ముడి లాంటి వాడు ఈ చిత్రానికి తను చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. అలాగే మరో తమ్ముడు కార్తీక్ కూడా ఫుల్ సపోర్ట్ చేశాడు. ఇక్షు మూవీ అనేది నా కళ. ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చాలా కష్టపడి తీశాము. నిర్మాత హనుమంతు రావు నాయుడు గారు ఈ సినిమాకు ఎం కావాలో అన్ని సమాకూర్చాడు. ఇలా అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది ఈ సినిమాను ఐదు భాషలలో విడుదల చేస్తున్నాము. సెప్టెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ఐదు దేశాలలో విడుదల చేస్తున్నాము. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర నిర్మాత హన్మంత్ రావు నాయుడు మాట్లాడుతూ.. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన దిల్ రాజు గారికి , బసిరెడ్డి గారికి, బేక్కం వేణుగోపాల్ గారికి దామోదర్ గారికి అందరికీ నా ధన్యవాదములు.ఈ చిత్రానికి పనిచేసిన నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా తొందరగా పూర్తి అయ్యింది. సెప్టెంబర్ 16 న విడుదల అవుతున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు

నటుడు చిత్రం శ్రీను మాట్లాడుతూ.. మా నిర్మాత వివి ఋషిక నాకు ఇంతకుముందు కలసి సినిమా అంటే చాలా ఇష్టం మంచి సినిమా తియ్యాలని ఉంది చెప్పడం జరిగింది. ఆ తరువాత తను కథ రెడీ చేసుకొని నన్ను పిలిచి ఈ కథ వినిపించడం జరిగింది. ఆ కథ వినగానే వీరు మంచి విజన్ ఉన్న దర్శకురాలు అనుకున్నాను. నెల్లూరు లో జరిగిన ఇన్సిడెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి.ఈ సినిమా తర్వాత వివి ఋషిక మేడం పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. హీరో రామ్ చాలా మంచి కుర్రాడు. ఇందులో చాలా చక్కగా నటించాడు. మంచి పట్టుదలతో నటిస్తున్న రామ్ పెద్ద హీరో అవ్వాలి. నిర్మాత హనుమంతరావు సినిమా విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.ఈ సినిమా తర్వాత పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పెద్ద, పెద్ద సినిమాలు నిర్మించాలని అన్నారు. సెప్టెంబర్ 16 న వస్తున్న ఈ సినిమాను గొప్ప విజయం సాదిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు

హీరో రామ్ అగ్నివేష్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి నేను బాలకృష్ణ గారి ఫ్యాన్ ని..అయన సినిమాలు చూసి పెరిగాను. నేను చాలా సినిమాలు చూశాను. నాకు దర్శకురాలు చెప్పిన కథ అద్భుతం అనిపించింది. దాంతో క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ తో నా క్యారెక్టర్ ను నా శక్తి మేర యాక్ట్ చేయడం జరిగింది.సెప్టెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని అన్నారు.

హీరోయిన్ రేఖా నిరోషా మాట్లాడుతూ.. దర్శక , నిర్మాతలు మమ్మల్ని బాగా చూసుకున్నారు. నవీన్ గారు నన్ను బాగా చూయించారు. సెప్టెంబర్ 16 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.

నటి ఫిదా మాట్లాడుతూ.. చాలా షార్ట్ టైమ్ లో ఈ సినిమా తీయడం జరిగింది.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.ఈ సినిమాకు ప్రేక్షకులందరూ ఫుల్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

సినిమాటోగ్రాఫర్ నవీన్ మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకురాలికి మంచి విజన్ ఉంది. మేమంతా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాము.ఇలాంటి మంచి చిత్రానికి వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు

నటీనటులు :
రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి, తదితరులు

సాంకేతిక. నిపుణులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల,
మూల కథ: సిద్ధం మనోహర్
కెమెరా: నవీన్ తొడిగి
పాటలు:-కాసర్ల శ్యామ్
మ్యూజిక్: వికాస్ బాడిస
ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్
ఆర్ట్స్: రాజు
మాటలు: మున్నా ప్రవీణ్
కొరియోగ్రఫీ: భాను
పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి.