న‌వంబ‌ర్ రెండో వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న `ఇద్ద‌రి లోకం ఒక‌టే`

546


యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్న చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఇప్ప‌టికే 90 శాతం సినిమా పూర్త‌య్యింది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ రెండో వారంలో విడుద‌ల చేయడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
రాజ్ త‌రుణ్‌, షాలిని పాండే, నాజ‌ర్‌, పృథ్వీ, రోహిణి, భ‌ర‌త్‌, సిజ్జు, అంబ‌రీష్‌, క‌ల్ప‌ల‌త త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: జీఆర్‌.కృష్ణ‌
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
నిర్మాత‌: శిరీష్‌
కెమెరా: స‌మీర్ రెడ్డి
మ్యూజిక్‌: మిక్కీ జె.మేయ‌ర్‌
ఎడిటింగ్‌: తమ్మి రాజు
డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి
పాట‌లు: శ్రీమ‌ణి, కిట్టు, బాలాజీ
స్టంట్స్‌: స‌్టంట్ శివ‌
కొరియోగ్ర‌ఫీ: భాను, విజ‌య్‌