HomeTeluguది డెవిల్స్ చైర్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాజీ మంత్రి...

ది డెవిల్స్ చైర్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్

అదిరే అభి హీరోగా స్వాతి మందల్ హీరోయిన్‌గా బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై రాబోతోన్న చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..

అదిరే అభి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు అవుతోంది. ఈ 23 ఏళ్లు ఉన్నందుకు సంతోషపడాలా? ఇంకా స్ట్రగుల్స్ పడుతున్నాని బాధపడాలా? అన్నది అర్థం కావడం లేదు. నేను ఈ 23 ఏళ్లు కష్టపడుతూనే ఉన్నాను. ఇంకో 23 ఏళ్లు అయినా కష్టపడతాను.. సక్సెస్ అయిన తరువాత బయటకు వెళ్తాను. ఒకరో ఇద్దరికో అయినా ఇన్ స్పైరింగ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే అన్నీ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతీ శుక్రవారం ఓ ఆర్టిస్ట్ తలరాత మారిపోతుంది. ఈ శుక్రవారం మేం రాబోతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ అన్ని భాషలకు యాప్ట్‌గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తీశాం. మంచి కాన్సెప్ట్‌తో పాటు మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. ఈ చిత్రం అందరినీ భయపెట్టేలా ఉంటుంది. నవీన్ గారు నిర్మాతగా మరో సినిమాను చేస్తున్నాను. నాకు అవకాశం ఇస్తున్న ప్రతీ ఒక్క నిర్మాతకు థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ.. ‘‘ది డెవిల్స్ చైర్’ ఫిబ్రవరి 21న రాబోతోంది. చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్ చేస్తుంది. డెవిల్ మీ ఇంటికి వస్తుంది. మంచి కంటెంట్‌తో ఈ చిత్రం రాబోతోంది. కావాల్సినంత డ్రామా, వినోదం ఉంటుంది. ఈ చిత్రం కోసం అభి చాలా కష్టపడ్డాడు. అతని సపోర్ట్‌ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. నిర్మాతల సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. నాకు ఈ ప్రాజెక్ట్ చేసిన గడ్డం నవీన్ అన్నకి థాంక్స్’ అని అన్నారు.

గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ‘నేను కళాకారుడ్ని కాదు. కానీ కళా హృదయం కలవాడ్ని. సోషల్ మీడియా వచ్చిన తరువాత ఎంతో మంది వెలుగులోకి వస్తున్నారు. ఈ డెవిల్ చైర్ పాయింట్ చెప్పినప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అభి అద్భుతంగా నటిస్తాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ‘మగధీర టైం నుంచి అభితో నాకు ప్రయాణం ప్రారంభమైంది. నా కెరీర్ ఆరంభంలో అభి నన్ను ఎంకరేజ్ చేశాడు. అభి చాలా మంచి వ్యక్తి. ఇలాంటి మంచి వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘నేను ఈ చిత్రంలో ఎలాంటి పాటలు రాయలేదు. అయినా ఈ ఈవెంట్‌కు వచ్చాను. దానికి కారణం అదిరే అభి. అతను చాలా మల్టీ టాలెంట్. అభినయ కృష్ణ అని సినారే గారు పేరు పెట్టారు. అదిరే అభిగా జబర్దస్త్ షోతో నవ్వించాడు. ఎంతో క్రమశిక్షణతో ఆయన ఉంటారు. ఆర్టిస్ట్, హీరోగా, డైరెక్టర్‌గా అభి అందరినీ అలరిస్తున్నారు. ఇంతలా కష్టపడే వ్యక్తికి అద్భుతమైన విజయం దక్కాలి. ఈ చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీ అంతా జబర్దస్త్ వాళ్లే ఉన్నారు. అభికి ఉన్న క్రమశిక్షణ వల్లే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండగలిగారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. అభికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ.. ‘అభి టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అలానే ఆదిని ఎంకరేజ్ చేయబట్టే అతను ఈ స్థాయికి వచ్చాడు. అభి దర్శకత్వం వహిస్తూనే హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. అభికి ఈ చిత్రం ద్వారా పెద్ద సక్సెస్ రావాలి’ అని అన్నారు.

కిరిటీ దామరాజు మాట్లాడుతూ.. ‘అభి దర్శకత్వంలో నేను పని చేశాను. ఈ చిత్రంలో నేను ఎలాంటి కారెక్టర్ చేయలేదు. ఇలాంటి కొత్త టీంను ఎంకరేజ్ చేయాలి. గంగాధర్ గారు, రేష్మ గారికి, అభి గారికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

స్వాతి మందల్ మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు గంగాధర్ గారికి థాంక్స్. నాపై నాకంటే దర్శకుడికే ఎక్కువగా నమ్మకం ఉండేది. అభి గారు అద్భుతమైన వ్యక్తి. మా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అభి గారితో నటించడం ఆనందంగా ఉంది. నా నిర్మాతలు వెంకట్ సర్, చంద్ర సర్‌లకు థాంక్స్. మా సినిమాను థియేటర్లో చూడండి’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రేష్మ మాట్లాడుతూ.. ‘మా సినిమాలోని సస్పెన్స్ చూస్తే ఆడియెన్స్ థ్రిల్ అవుతారు. మా దర్శకుడు గంగాధర్ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. నాకు ఇంతగా సపోర్ట్ చేసిన మా టీంకు థాంక్స్. అభి గారు, స్వాతి చక్కగా నటించారు. మా సినిమాను థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది,
సుమారు 50 థియేటర్లలో ఈ సినీమా విడుదల అవుతుంది అని అన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES