ఐయామ్ఎ న్యాచుర‌ల్ యాక్ట‌ర్ – హీరోయిన్ రాశిసింగ్‌

1018

ఆది సాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శ‌శి’. సుర‌భి నాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న సంద‌ర్భంగా ఈ సినిమాలో ఒక కీల‌క‌పాత్ర పోషించిన హీరోయిన్ రాశీ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..

నేప‌థ్యం
మాది రాయ్‌పూర్‌. చిన్న‌ప్ప‌టినుండి యాక్ట‌ర్ అవ్వాల‌నేది నా కోరిక‌. అయితే అంద‌రిలాగే ముందు కొంచెం సెటిల్ అయ్యి మా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ని బాగా చూసుకోవాల‌ని ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా ప‌ని చేశాను, నాకు జాబ్ వ‌చ్చాక మా ఫ్యామిలీ అంతా హైద‌రాబాద్‌కి షిఫ్ట్ అయ్యాం. ఒక సంవ‌త్స‌రం త‌ర్వాత సినిమాల్లో అవ‌కాశాల‌కోసం ప్ర‌య‌త్నం చేయ‌డం ప్రారంభించాను. ల‌క్కీగా మా మేనేజ‌ర్ ద్వారా ఈ సినిమాతో పాటు మ‌రో రెండు మూడు సినిమాల్లో అవ‌‌కాశం వ‌చ్చింది.

నేను వేరే సినిమా షూటింగ్లో ఉన్న‌ప్పుడు ద‌ర్శ‌కుడు ఈ క‌థ నాకు చెప్పారు. నాకు ముందు నుండి రెగ్యుల‌ర్ పాత్ర‌లు కాకుండా స‌మ్‌థింగ్ డిఫ‌రెంట్‌రోల్స్ చేసి ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని ఉండేది. అందువ‌ల్ల ఈ క‌థ విన‌గానే స‌రిగ్గా అలాంటి పాత్రే అనిపించింది. మ‌రో విష‌యం ఏంటంటే నేను ఆ సినిమాలో చేస్తున్న దానికి కంప్లీట్ ఆపోజిట్ రోల్‌. చాలా ఎమోష‌న‌ల్ సీన్స్‌తో న‌ట‌న‌కు మంచి ఆస్కారం ఉన్న పాత్ర కావ‌డంతో వెంట‌నే ఓకే చెప్పాను. ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ పేరు సునీత‌. ఒక హోమ్లీ క్యారెక్ట‌ర్‌. ఈ సినిమా మ‌న నిజ జీవితాల‌ను ప్ర‌తిబింబించేలా ఉంటుంది. అందుకే రేపు థియేట‌ర్‌లో ఆడియ‌న్స్ త‌ప్ప‌క క‌నెక్ట్ అవుతారనే న‌మ్మ‌కం ఉంది.

ఈ సినిమాలో సుర‌భి కూడా న‌టిస్తోంది. ఆమె నా క‌న్నా సీనియ‌ర్‌. చాలా సినిమాల్లో న‌టించింది. అయితే మా ఇద్దరికి కాంబినేష‌న్ సీన్లు లేవు. నా పాత్ర నేను చాలా కాన్ఫిడెంట్ గా చేశాను. ఆది బ్యాండ్‌లో సింగ‌ర్‌గా క‌నిపిస్తాను. ఇప్ప‌టికే మా బ్యాండ్‌కు సంబందించిన పాట విడుద‌లైంది, మంచి రెస్పాన్స్ కూడా వ‌స్తోంది.

ఆది రియ‌ల్ జెంటిల్‌మేన్‌. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం గ్రేట్ ఎక్స్‌పీరియ‌న్స్‌. సెట్లో ఎప్పుడూ న‌న్ను కంఫ‌ర్ట్‌గా చూసుకునేవారు. ఆదితో షూటింగ్ చాలా స‌ర‌దాగా జ‌రిగింది.

శ్రీ‌నివాస్ గారు ఈ క‌థ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న‌ప్పుడే నాకు ఆయ‌న మీద కాన్ఫిడెన్స్ వ‌చ్చింది. నేను ఈ సినిమా కోసం ఎలాంటి వ‌ర్క్ శాప్స్ చేయ‌లేదు. యాక్టింగ్ కోర్స్ కూడా చేయ‌లేదు. ఐయామ్ఎ న్యాచుర‌ల్ యాక్ట‌ర్‌. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది కాబ‌ట్టి సినిమా మీద కాన్ఫిడెంట్ తో ఉన్నాం.

నాకు యాక్ట‌ర్‌గా ప్రియాంక‌చోప్రా ఇన్స్‌పిరేష‌న్‌. అన్ని జోన‌ర్స్‌లో సినిమాలు చేయాల‌నేదే నా కోరిక‌. నా త‌దుప‌రి చిత్రం ఒక మ‌ర్డ‌ర్ మిస్ట‌రి థ్రిల్ల‌ర్‌. చాలా సస్పెన్స్ ఉంటుంది. ఆ త‌రువాత ఒక ఫ్యామిలీ డ్రామా, మ‌రోక ఫుల్ రొమాంటిక్ మూవీస్ చేస్తున్నాను. ఆడియ‌న్స్ న‌న్ను ఎలాంటి పాత్ర‌లో ఇష్ట‌ప‌డ‌తారో తెలుసుకోవాల‌ని ఉంది. అన్ని సినిమాల్లో కూడా పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉండే క్యారెక్ట‌ర్ దొర‌క‌డం అదృష్టంగా భావిస్తున్నాను. భ‌విష్య‌త్‌లో అల్లు అర్జున్‌, రాజ‌మౌళి గారితో వ‌ర్క్ చేయాల‌నుకుంటున్నాను. ‌