అనగనగా ఓ పోలీస్…
అతని పేరు అర్జున్!
సిక్స్ ప్యాక్ బాడీ…
స్టైలిష్ యాటిట్యూడ్…
ఎక్స్‌ట్రాడినరీ ఫైటింగ్ స్కిల్స్…
అన్నిటికీ మించి ధైర్య సాహసాలు…
అర్జున్ అంటే ఐకానిక్ పోలీస్ అన్నమాట!
అయితే… ఇక్కడ ఒక ట్విస్ట్ ఉండండోయ్!!
అర్జున్‌లో ఇద్దరు ఉన్నారు! ఒకరు ‘ఎ’, మరొకరు ‘బి’ అనుకుంటే… అర్జున్ ‘ఎ’కి తెలిసిన మనుషులు, ఇన్సిడెంట్స్, పర్సనల్ లైఫ్ ఏదీ అర్జున్ ‘బి’కి తెలియదు. వేర్వేరు మనుషులు అన్నట్టు! అయితే… అర్జున్ ‘ఎ’కి తెలిసిన భాషలు, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ అర్జున్ ‘బి’లో ఉన్నాయి. అర్జున్ ‘ఎ’గా ఉండటమే అర్జున్‌కు ఇష్టం! అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది ‘హంట్’ సినిమాలో చూడాలి.
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. నేపథ్యంలో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
‘హంట్’ టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేశారు. సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. ‘తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా… ఎంత ఎఫెక్ట్ అయినా… నన్ను ఎవరూ ఆపలేరు’ అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత క్యూరియాసిటీ పెంచింది.
సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ సైతం పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్న చిత్రమిది. విడుదలైన కొన్ని క్షణాల్లో ‘హంట్’ టీజర్‌కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ట్రెండ్ అవుతోంది.
చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ ”టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. సుధీర్ బాబు పెర్ఫార్మన్స్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. యాక్షన్ బావుందని చెబుతున్నారు. థ్రిల్లింగ్‌గా ఉందంటున్నారు. టీజర్, సుధీర్ బాబు నటన సినిమాపై అంచనాలు పెంచాయి. అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుంది. ఇదొక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. చిత్రీకరణ పూర్తయింది. సినిమా బాగా వచ్చింది. ప్రస్తుతం రీ రికార్డింగ్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం” అని అన్నారు.
చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ ”ఇంటర్నేషనల్ టెర్రరిజంను టచ్ చేస్తూ తెరకెక్కించిన పోలీస్ థ్రిల్లర్ ఇది. టీజర్‌కు లభిస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తోంది. అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్ కోసం సుధీర్ బాబు గారు ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఫిట్ అండ్ లీన్ లుక్‌లోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆయన ఇటువంటి కాప్ థ్రిల్లర్ చేయలేదు. ఆయన క్యారెక్టర్, కథ, సినిమా చాలా కొత్తగా ఉంటాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్సులు ఫ్రాన్స్‌లో తీశాం. ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇవ్వడంతో పాటు కొత్త కాన్సెప్ట్‌ను చూపిస్తుందీ సినిమా” అని అన్నారు.
‘హంట్’ సినిమాలో నటీనటులు:
సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, ‘జెమినీ’ సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం.
‘హంట్’ సినిమా సాంకేతిక వర్గం :
ఆర్ట్ డైరెక్టర్ : వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డి, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరోప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.