‘హల్చల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

868

Film; HUlchal

Release date : 3/1/2020

www.moviemanthra.com;Rating-3/5

‘రాజు గారి గది’ వంటి సినిమాలలో హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించిన ధన్య బాలకృష్ణ ఇప్పుడు ‘హల్చల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రుద్రాక్ష్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సస్పెన్స్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి శ్రీపతి కర్రి దర్శకత్వం వహించారు. రవి ప్రకాష్, జెమిని సురేష్ మరియు ప్రీతినిగమ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. టీజర్ మరియు ట్రైలర్ లతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

కథ:

తను కష్టపడి కూడగట్టుకున్న డబ్బులు అన్నిటినీ పోగేసి దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చేస్తాడు రుద్రాక్ష్ (రుద్రాక్ష్). వచ్చే దారిలో తన స్నేహితుడు (కృష్ణుడు) అతనికి ఒక మరియు ఒక ద్రవం మరియు ఒక పర్సు ఇస్తాడు. ఆ ద్రవం పేరే హల్ చల్. కొన్ని కారణాల వల్ల రుద్రాక్ష్ హల్చల్ ని తాగేస్తాడు. దీంతో అతనికి అంతా భ్రాంతిగా ఉంటుంది. తను ప్రేమించిన స్వాతి (ధన్య బాలకృష్ణ) అనే అమ్మాయి ఎప్పుడూ తనతోనే ఉన్నట్లు, తనతో మాట్లాడుతున్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల హల్చల్ మరియు ఆ పర్సు కోసం విలన్లు హీరో వెనుక పడతారు. మరి రుద్రాక్ష్ హల్చల్ మత్తులో నుంచి ఎప్పుడు ఎలా బయటపడ్డాడు? ఈ లోపు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

సినిమా లో రుద్రాక్ష్ నటన సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. మొదటి సినిమా అయినప్పటికీ హావభావాలు మరియు డైలాగ్ డెలివరీ విషయంలో రుద్రాక్ష్ మంచి మార్కులే వేయించుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలలో రుద్రాక్ష్ నటన చాలా బాగుంది. సినిమాలో ధన్య బాలకృష్ణ చాలా అందంగా కనిపించడం మాత్రమే కాక తన నటనతో కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. డాక్టర్ పాత్రలో రవి ప్రకాష్ కనిపించింది కాసేపు అయినప్పటికీ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసాడు. ఎప్పటిలాగానే ప్రీతినిగమ్ హీరో తల్లి పాత్రలో చాలా సహజంగా నటించారు. ఈ సినిమాకి ఆమె నటన మరింత బలాన్ని చేకూర్చింది అని చెప్పుకోవచ్చు. జెమినీ సురేష్ కూడా ఆ సినిమాలో తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. కృష్ణుడు కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగానే వర్కౌట్ అయింది.

సాంకేతిక వర్గం:

దర్శకుడు శ్రీపతి కర్రి ఈ సినిమా కోసం ఒక సరికొత్త కాన్సెప్ట్ ని ఎంచుకున్నారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. సినిమా మొత్తం ఒకే ట్విస్ట్ తో ముందుకు నడుస్తున్నప్పటికీ దర్శకుడు సినిమాని బాగానే ఆసక్తికరంగా మలిచాడు అని చెప్పుకోవచ్చు. నెరేషన్ కొంచెం స్లో గా ఉన్నప్పటికీ దర్శకుడు శ్రీపతి కథని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై గణేష్ కొల్లూరి అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. హనుమాన్ సిహెచ్ సంగీతం కూడా చాలా బాగుంది. పాటల సంగతి పక్కన పెడితే హనుమాన్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అతని కెమెరా యాంగిల్స్ మరియు విజువల్స్ సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు తీసేసి ఉంటే సినిమా ఇంకా బాగుండేది.

సమీక్ష:

సస్పెన్స్ కామెడీ అయినప్పటికీ దర్శకుడు సినిమాలో కేవలం ఎంటర్టైన్మెంట్ మరియు కామెడీ సన్నివేశాలు పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సన్నివేశాలు కాస్త స్లో గా అనిపించాయి. కానీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు సినిమా కి చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా ఫస్ట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో కూడా హీరో మరియు కృష్ణుడు మధ్య వచ్చే సన్నివేశాలు మరియు కామెడీ చాలా బాగుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు సినిమా లెంగ్త్ ని పెంచుతున్నట్లు అనిపిస్తాయి. స్లో స్క్రీన్ ప్లే కూడా మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కానీ ఎంటర్టైన్మెంట్, నటీనటులు మరియు నేపధ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. చివరిగా ‘హల్చల్’ సినిమా ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఒక మంచి సస్పెన్స్ కామెడీ చిత్రం.