తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎస్ 5 నో ఎగ్జిట్. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30 థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం అవినాష్ కాలేజ్ విద్యార్థుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయిక నందితా శ్వేత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా
నందితా శ్వేత మాట్లాడుతూ…నన్ను హారర్ క్వీన్ అని పిలుస్తుంటారని మీకు తెలుసు. నేను చేసిన సినిమాలు నాకు అలాంటి పేరు తీసుకొచ్చాయి. ఈ సినిమా కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై నుంచి వచ్చాను. ఇక్కడ మీ కాలేజీలో విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉంది. నేను కూడా ఇక్కడే అడ్మిషన్ తీసుకుని చదువుకోవాలని అనిపిస్తోంది. ఎస్ 5 నో ఎగ్జిట్ సినిమా థియేటర్లలో చూడండి. అని చెప్పింది.
నిర్మాతలు మాట్లాడుతూ…అవినాష్ కాలేజ్ యాజమాన్యానికి మా కృతజ్ఞతలు. మా సినిమా టీజర్ ఇక్కడ మీ ముందు విడుదల చేయడం సంతోషంగా ఉంది. మీ దగ్గర నుంచి వస్తున్న ఈ అపూర్వ స్పందన చూస్తుంటే సినిమా విజయం ఖాయమని అర్థమవుతోంది. అన్నారు.
దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ…హారర్ థ్రిల్లర్ గా ఎస్ 5 మీకు నచ్చుతుంది. మా టీజర్ కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మీ అరుపులకు స్టేజ్ అదిరిపోతుంది. మణిశర్మ గారి సంగీతం, గరుడ వేగ అంజి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 30 మీ ముందుకొస్తున్నాం. మీలో హారర్ మూవీస్ ఇష్టపడే అందరికీ సినిమా నచ్చుతుంది. అన్నారు.
సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి మాట్లాడుతూ…ఎస్ 5 నో ఎగ్జిట్ కోసం ఇప్పటిదాకా ఎవరు యూజ్ చేయని టెక్నాలజీ వాడాం. సినిమాటోగ్రఫీకి మంచి పేరొస్తుంది. దర్శకుడిగా భరత్ సినిమాను అద్భుతంగా రూపొందించాడు. ఒక ట్రైన్ బోగిలో హిలేరియస్ హారర్ జర్నీ చూస్తారు. అన్నారు.
మెహబూబ్ దిల్ సే, సురేష్ వర్మ, ఫిష్ వెంకట్, రఘు, రితుజా సావంత్, అవంతిక హరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్- గ్యారీ బీహెచ్, సంగీతం – మణిశర్మ, సినిమాటోగ్రఫీ – గరుడ వేగ అంజి, ఆర్ట్ – నాగేంద్ర, స్టంట్స్ – రియల్ సతీష్, పీఆర్వో – జీఎస్కే మీడియా