HomeTeluguశుక్రవారం రోజున జరిగిన నల్లగొండ జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి,

శుక్రవారం రోజున జరిగిన నల్లగొండ జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి,


అధ్యక్షత వహించిన జడ్ పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి.పాల్గొన్న శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి,అలుగుబెల్లి నర్సిరెడ్డి,శాసనసభ్యులు యన్.భాస్కర్ రావు,రవీంద్ర నాయక్,నోముల భగత్ తదితరులు.

అభివృద్ధి లో తెలంగాణా పల్లెలు పట్టణాలతో సరి సమానంగా పోటీ పడుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా యావత్ భారతదేశంలోనే తెలంగాణా పల్లెలు నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నాయన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమన్నారు.శుక్రవారం రోజు జరిగి నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి,అలుగుబెల్లి నర్సిరెడ్డి శాసనసభ్యులు యన్.భాస్కర్ రావు, యన్.రవీంద్ర కుమార్,నోముల భగత్ జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక

సభ్యులు,మండల ప్రజా పరిషత్ అధ్యకులతో పాటు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలోనూ
అభివృద్ధి,సంక్షేమం కార్యక్రమాలకు అవరోధం లేకుండా పరుగులు పెట్టించిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఆర్థిక పరిపుష్టిలోనూ తెలంగాణాయో మొదటి స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. దేశ సగటు ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువగా ఉందన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

Dear Uma Movie Review

ALL CATEGORIES