హిమాల‌య స్టూడియో మేన్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం

949

స్టార్ హీరోలు, భారీ బ‌డ్జెట్ చిత్రాలు త‌ప్ప మీడియం చిత్రాలు ఇటీవ‌ల కాలంలో విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. అందులో క‌రోనా త‌ర్వాత విదేశాల‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఇలాంటి క్ర‌మంలో హిమాల‌య మేన్ష‌న్స్ అధినేత పి.ఉద‌య్ కిర‌ణ్‌, నూత‌న ద‌ర్శ‌కుడు సురేష్ ధైర్యంగా ముంద‌డుగేసి ఇటీవ‌ల దుబాయ్‌లో దాదాపు ప‌ది రోజుల‌కు పైగా అక్క‌డే ఉండి మూడు పాట‌లు విజ‌య‌వంతంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్నారు‌. సాయి రోన‌క్‌, నేహ సోలంకి హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత పి.ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ…“ఇటీవ‌ల మా టీమ్ దాదాపు 30 మందికి పైగా దుబాయ్ వెళ్లాము. దుబాయ్ తో పాటు షార్జా లో అంద‌మైన లొకేష‌న్స్ లో మూడు పాట‌లు చిత్రీక‌రించాము. కొవిడ్ కి సంబంధించిన‌ జాగ్ర‌త్త‌లు అన్నీ పాటిస్తూ చిత్ర యూనిట్ స‌హ‌కారంతో అనుకున్న విధంగా ఈ షెడ్యూల్ పూర్తి చేయ‌గ‌లిగాం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఓ సెల‌బ్రిటీ చేతుల మీదుగా మా సినిమాకు సంబంధించిన టైటిల్, ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు సురేష్ మాట్లాడుతూ…“ ఈ ప్రేమ క‌థా చిత్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా క‌థ డిమాండ్ ని బ‌ట్టి ఖ‌ర్చు పెడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల దుబాయ్‌లో మూడు పాట‌లు గ్రాండ్ గా చిత్రీక‌రించాము. భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన అద్భుత‌మైన పాట‌ల‌కు మాస్ట‌ర్ వెంక‌ట్ దీప్ అదే స్థాయిలో కొరియోగ్రఫీ చేశారు “ అన్నారు.

శ‌శాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, హేమ‌, ర‌ఘు, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; సాహిత్యం: సురేష్ గంగుల, దేవ్; ఎడిటింగ్ః ఉపేంద్ర‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు; పిఆర్వోః బాక్సాఫీస్ మీడియా; సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి; నిర్మాతః పి.ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్‌.