ఉపేంద్ర హీరోగా “కబ్జా” నూతన చిత్రం ప్రారంభం!!

558

ఓం, ఎ, రా, చిత్రాలతో సెన్షేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉపేంద్ర “సన్నాఫ్ సత్యమూర్తి” చిత్రంలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం”కబ్జా”. 1947-80ల మధ్య అండర్ వరల్డ్ డాన్ కథాంశంతో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ పతాకంపై లగడపాటి శ్రీధర్ సమర్పణలో ఆర్.చంద్రు దర్శకుడిగా ఆర్.చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం జనవరి4న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభం అయింది. పూజాకార్యక్రమాల అనంతరం ఉపేంద్ర పై చిత్రీకరించిన ముహూర్తుపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ క్లాప్ నివ్వగా, ఆనంద్ గురూజీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు..ఈ సన్నివేశనికి బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరో ఉపేంద్ర, దర్శకుడు ఆర్.చంద్రు, సమర్పకుడు లగడపాటి శ్రీధర్, నిర్మాతలు ఆర్.చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మునేంద్ర కె.పుర, కో-ప్రొడ్యూసర్స్ గోనుగుంట్ల శ్రీనివాస్, ఆర్.రాజశేఖర్, ఆనంద్ గురూజీ, హెచ్ యం, రేవన్న, ఫైట్ మాస్టర్ రవి వర్మ, తదితరులు పాల్గొన్నారు.. ఇదే వేదికపై కబ్జా మోషన్ పోస్టర్ ని లగడపాటి శ్రీధర్ లాంచ్ చేశారు.

రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. ఎ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అప్పట్నుంచి సన్నాఫ్ సత్యమూర్తి వరకు నన్ను వారు అభిమానిస్తూనే వున్నారు. కబ్జా ఒక అండర్ వరల్డ్ డాన్ కథ. చాలా కొత్త జోనర్లో పాన్ ఇండియా స్థాయిలో చెయ్యాలని టీమ్ అంతా ప్లాన్ చేశాం. అప్పట్లో ఓం చిత్రాన్ని ఎక్స్ పెరిమెంట్ చేశాం. అలాగే ఓ కొత్త జోనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటాడు. అతనితో చేసిన రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. మా కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రం కూడా ప్రేక్షకుల హృదయలను కబ్జా చేస్తుంది..అన్నారు.