CRPF DIG ఆధ్వర్యంలో “సుందరాంగుడు ” హీరో కృష్ణ సాయి బర్త్ డే వేడుకలు

508

ఎమ్‌.ఎస్‌.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్‌ పతాకంపై కృష్ణసాయి హీరోగా న‌టిస్తున్న లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘సుందరాంగుడు’. హీరో కృష్ణ సాయి స‌ర‌స‌న మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈచిత్రాన్ని చందర్‌గౌడ్‌, యం.యస్‌.కె. రాజులు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు… నేడు హీరో కృష్ణ సాయి పుట్టిన రోజు సంధ‌ర్భంగా CRPF DIG ఆధ్వర్యంలో కేక్ క‌ట్ చేసి బర్త్ డే వేడుకలు జ‌రుపుకున్నారు. ఈ వేడుక‌లో డిఐజి, కమాండెంట్, అదనపు కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్ మరియు అసిస్టెంట్ కమాండెంట్ అధికారులు కేక్ కటింగ్‌లో పాల్గొన్నారు. అనంత‌రం అధికారులు హీరో కృష్ణ‌సాయికి మొమెంటో అంద‌జేసి .. కృష్ణ సాయి అంతర్జాతీయ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవ‌ల‌ను కోనియాడారు.. త్వ‌ర‌లో రిలీజ్ కాబోతున్న సుంద‌రాంగుడు మూవీ గ్రాండ్ స‌క్సెస్ కావాల‌ని ఆకాంక్షించారు..

హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ …త‌న బ‌ర్త్ డే వేడుక‌లు CRPF DIG మ‌రియు కమాండెంట్ అధికారుల సమ‌క్షంలో జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు..త‌న ట్ర‌స్ట్ ద్వారా చేస్తున్న సేవ‌ల‌ను అధికారులు అభినందిండం ఎంతో సంతోషాన్ని క‌లిగించింద‌ని అన్నారు.. సుంద‌రాంగుడు చిత్రాన్ని త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని తెలిపారు.. అంతేకాకుండా మ్‌.ఎస్‌.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై మ‌రో కొత్త చిత్రం నిర్మిస్తున్నామ‌ని …ప్ర‌ముఖ సీనియ‌ర్‌ ఆర్టిస్ట్ లు న‌టిస్తున్న ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని అన్నారు…

నటీనటులు:
కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ ,జీవా, భాషా, అమిత్‌ తివారి, జూనియర్‌ రేలంగి, మిర్చి మాధవి తదితరులు.

సాంకేతిక నిపుణులు :
నిర్మాతలు: ఎమ్‌.ఎస్‌.కే. రాజు-చందర్‌ గౌడ్‌,
దర్శకత్వం: వినయ్‌ బాబు
మ్యూజిక్‌: సిద్ధబాబు,
సింగర్స్ : Late జై శ్రీనివాస్ , ధనుంజయ , అంజన సౌమ్య ,గీతా మాధురి
కెమెరా: వెంకట్‌ హనుమాన్‌
ఎడిటింగ్‌: నందమూరి హరి
డ్యాన్స్‌: నిక్సన్‌, పాల్‌, సూర్య కిరణ్‌, అనిష్‌, రవికృష్ణ
ఫైట్స్‌: రామ్‌ సుంకర-అశోక్‌రాజ్‌

పి.ఆర్‌.ఓ: దయ్యాల అశోక్‌