రోరి, భద్రం బీ కేర్ ఫుల్ లాంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ తేజ్ ఇప్పుడు వ్యాపారవేత్తగా మారారు. రోరి బ్రింగ్ ఔట్ పేరుతో ఒక రెస్టారెంట్ మొదలు పెట్టనున్నారు. గుంటూరు లక్ష్మీపురంలో ఏప్రిల్ నెలలో ఈ రెస్టారెంట్ ఓపెన్ కానుంది. ఇప్పటికే మొదలైన ఆన్లైన్ స్టోర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కేవలం సేంద్రీయ వ్యవసాయంతో పండించే కూరగాయలు మాత్రమే వాడుతూ తమ రెస్టారెంట్ నడుపుతామని చరణ్ తేజ తెలిపారు. నటుడిగా ప్రేక్షకులను వినోదం పంచడమే కాదు.. వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా తనపై ఉందని తెలిపారు చరణ్ తేజ్.