అరుణ్ అదిత్, పూజిత పొన్నాడ జంట‌గా‌ ‘కథ కంచికి మనం ఇంటికి’ టైటిల్ సాంగ్ విడుద‌ల‌, అనూహ్య స్పంద‌న‌

534

వ‌రుసగా మంచి చిత్రాలు చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో అదిత్ అరుణ్ హీరోగా, పూజిత పొన్నాడ జంటగా MP ఆర్ట్స్ బ్యానర్‌పై చాణక్య చిన్న ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం క‌థ కంచికి మ‌నం ఇంటికి. ఈ చిత్రం టైటిల్ ని ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండి సినిమా ల‌వ‌ర్స్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. పక్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యంగ్ ప్రొడ్యూస‌ర్ మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కి అనూహ్య స్పంద‌న ల‌భించిన నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన‌ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ ని విడుద‌ల చేశారు. క‌థ కంచికి మ‌నం ఇంటికి టైటిల్ నే నేప‌థ్యంగా తీసుకుని పురాణ‌ల ద‌గ్గ‌ర నుంచి నేటి త‌రం జెన‌రేష‌న్ వ‌రుకు అన్ని ముఖ్యాంశాల్ని క‌లుపుతూ తేలికైన ప‌దాల‌తో లిరిక్ రైట‌ర్ శ్రీనివాస తేజ ఈ పాట‌ను అద్భుతంగా రాశారు, అందుకు త‌గ్గ‌ట్లునే క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు సంగీత ద‌ర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ప్ర‌స్తుతం ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాకు ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న ఈ సినిమాకు శ్రీనివాస్ తేజ మాటలు రాస్తున్నారు. వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.

పాట లిరిక్స్

అయ్య మాట కోసమంటు
రాములోరు అడివికెళితే
రాకాసోడు మాయచేసి సీతనెత్తుకెళ్లిపోతే
రాముడొచ్చి యుద్దమాడి
రావణుడి తలను కొడితే
సీతమ్మోరి సెయ్యి పట్టి
తిరిగి ఇంటికెళ్లిపోతే
పట్టాభిషిక్తుడై పరిపాలిస్తే
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి

పాచికల ఆటలోన
పాండవులు ఓడిపోతె
పాంచాలి కొకలాగి
కౌరవులు రెచ్చిపోతె
కిట్టమూర్తి ఎంటరయ్యి
కొట్టుకుని సావమంటే
కొట్లాట లోన కౌరవులు రాలిపోతే
కధ నడిపించిన కన్నయ్య నవ్వితే
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి

అమరేంద్ర బాహుబలి
కాలకేయ తాట తీస్తే
బళ్లాల దేవుడు
కుళ్లుకుని పథకమేస్తే
కట్టప్ప బాహుబలిని
వెన్ను పోటు పొడిస్తే
నీటి కొండ ఎక్కి శివుడు
బళ్లాల బెండు తీస్తే
మహేంద్ర బాహుబలి
మహారాజు అయితే
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి

ఎన్ టి ఆర్ ఏ ఎన్ ఆర్
సూపర్ స్టార్ రెబల్ స్టార్
శోభన్ బాబు మెగాస్టార్
బాలయ్య నాగార్జున
వెంకటేష్ పవర్ స్టార్
జూనియర్ ఎన్టీఆర్
ప్రిన్స్ బాబు ప్రభాసు
రామ్ చరణ్ అల్లుఅర్జున్
హీరోలంతా కలిసి ఏ సినిమా తీసినా
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి

హరి కధలు బుర్ర కధలు
తోలు బొమ్మలు నాటకాలు
చందమామ చిట్టి కధలు
తాత భామ పొట్టి కథలు
పెదరాసి పెద్దమ్మ
రాజుల కధలు
చాగంటి గరికపాటి
గమ్మత్తు కధలు
అనగనగఅనగని ఏ కధలు చెప్పినా
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి
కధ కంచికి మన మింటికి

నటీనటులు
అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, హేమంత్ , గెటప్ శ్రీను తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ :- యమ్. పి.ఆర్ట్స్
టైటిల్ :- కథ కంచికి మనం ఇంటికి
నిర్మాత :- మోనిష్ పత్తిపాటి
దర్శకత్వం :- చాణిక్య చిన్న
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- సుభాష్ డేవాబత్తిన
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ – ద‌త్తి సురేశ్ బాబు
లైన్ ప్రొడ్యూసర్ :- కుమార్ కోట
మ్యూజిక్ :- బీమ్స్ సిసిరోలియో
డి.ఓ.పి :- వైయస్ కృష్ణ
ఎడిటింగ్ :- ప్రవీణ్ పూడి
డైలాగ్స్ :- శ్రీనివాస్ తేజ
ఫైట్స్ :- షావోలిన్ మల్లేష్
వి.యఫ్ యక్స్ :- దుర్గా ప్రసాద్ కేథ, ఆనంద్ పల్లకి
పి.ఆర్.ఓ :- ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్