ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓవైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు కథానాయకుడిగా కూడా కనిపిస్తూ ఉంటాడు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు తాజాగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా,దీక్షిత్ శెట్టి (కన్నడ హిట్ మూవీ ‘దియా’ ఫేమ్), వెన్నెల రామారావు ప్రధాన పాత్రధారులుగా కనిపించనున్నారు. తాజాగా ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శ్రీనివాస రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ఒకే పోస్టర్‌లో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
పోస్టర్‌లో కనపడుతున్నట్లుగా ‘ముగ్గురు మెనగాళ్లు’లో శ్రీనివాసరెడ్డికి వినపడదు, దీక్షిత్ శెట్టి మాట్లాడలేడు, వెన్నెల రామారావుకు కనపడదు. ఇలా ఈ ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆలరించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాను గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు, విశేషాలు తెలియాలంటే ట్రైలర్ విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
నటీనటులు
శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి (‘దియా’ మూవీ హీరో), వెన్నెల రామారావు, త్విష్ శర్మ, శ్వేతా వర్మ, నిజర్, రాజా రవీంద్ర, జెమిని సురేష్, జోష్ రవి,బద్రం, సూర్య, జబర్తస్త్ సన్నీ
సాంకేతిక నిపుణులు
కో ప్రొడ్యూసర్స్: తేజ చీపురుపల్లి, రవీందర్‌రెడ్డి అద్దుల
డీఓపీ: గరుడవేగ అంజి
మ్యూజిక్ డైరెక్టర్: సురేష్ బొబ్బిలి
బ్యాగ్రౌండ్ స్కోర్: చిన్న
ఎడిటర్: బి. నాగేశ్వర రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: నాని
డైరెక్టర్: అభిలాష్ రెడ్డి
ప్రొడ్యూసర్: పి. అచ్యుత్‌రామారావు