అభిరామ్ వర్మ, సాత్విక రాజ్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ నీతో. ఏవిఆర్ స్వామి, ఎమ్ఆర్ కీర్తన, స్నేహాల్ జంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాలు శర్మ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. లవ్ లైఫ్ డ్రామాగా నీతో టీజర్ ఆకట్టుకుంటుంది. యూత్ ఫుల్ అంశాలతో ఈ టీజర్ కట్ చేసారు దర్శక నిర్మాతలు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్ అయింది. టీజర్‌లో మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న నీతో సినిమాకు మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సుందర్ రామ్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతుంది.
నీతో మూవీ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్.
–ప్రొడ్యూసర్ ఏ వి ఆర్ స్వామి గారు మాట్లాడుతూ ఇక్కడకి వచ్చిన పెద్దలు అందరికి, మీడియా మిత్రులకి నా నమస్కారములు, నేను రాహు అనే మూవీ తో నా ప్రయాణం స్టార్ట్ చేశాను, బాలు గారి తో ఒక సినిమా చేశాను, ఇప్పుడు నీతో చేస్తున్నాను, ఈ సినిమా తప్పకుండా మీ ఆదరణ పొందుతుంది అని మాట్లాడారు.
–హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ కి రావటానికి కారణం టీజర్ నాకు చాలా చాలా నచ్చింది, సినిమా ఆటోగ్రాఫేర్ సుందర్ అమేజింగ్ వర్క్, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అమేజింగ్, బాలు ఈ నగరానికి ఏమైంది కి వర్క్ చేసాడు, పవిత్రలోకేష్ గారు దియా లో తన నటనకి నా కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి, రవివర్మ వెన్నల చూసినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను, డైరెక్టర్ చెపుతున్నాడు మాది చిన్న సినిమా అని అంటున్నాడు సినిమా రిలీజ్ అయ్యాక చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతాయి, మొదట్లో అభిరామ్ నేను కలిసి అవకాశాలు కోసం ట్రావెల్ చేసాం, మా గ్రూప్ లోనే ఉంటేవాడు, అల్ ది బెస్ట్ అభిరామ్,ప్రొడ్యూసర్స్ థాంక్స్ యు సార్,నన్ను ఈ ఈవెంట్ కి పిలిచినందుకు అని చెప్పి ఈ సినిమా మంచి విజయం సాదించాలి అని కోరుకున్నాడు.
–పవిత్ర లోకేష్ మాట్లాడుతూ అందరికి నమస్కారం, ఇక్కడ అందరు యంగ్ స్టార్స్ వున్నారు, వీళ్ళు అందరిని కలవటం చాలా ఆనందం గా వుంది, ప్రొడ్యూసర్స్ సినిమా తీయటం అనేది ఒక వ్యాపారం లాంటిది,చాలా సీరియస్ గా సినిమాలు నిర్మించాలి, బాలు శర్మ గురించి చెప్పాలి అంటె చాలా మంచివాడు, ఫస్ట్ డైరెక్టర్ అంటె ఏమో అనుకున్నాను కాని సెట్ లో తన వర్క్ చూసిన తరువాత అంత క్లియర్ అయ్యింది, విశ్వక్ ని కలవటం చాలా హ్యాపీ గా వుంది, అభిరామ్ చాలా పెద్ద హీరో అవుతాడు, ఇప్పుడు మంచి సినిమాలు చేసుకుంటూ పొతే స్మాల్ బడ్జెట్ అనేది నో మేటర్ మేటర్, థాంక్ యు పప్రొడ్యూసర్స్ అలాగే అల్ ది బెస్ట్ చెప్పారు.
–స్నేహాల్ గారు మాట్లాడుతూ నీతో ఒక మెట్రో సెక్షన్ లవ్ స్టోరీ, మెట్యూర్డ్ లవ్ స్టోరీ, దీనిలో అన్ని ఎమోషషన్స్ ఉంటాయి, ఇది నాకు, మా వైఫ్ కీర్తన కి ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది రొటీన్ గా వుండే సినిమా కాదు మీ అందరికి సినిమా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను.
–సినిమాటోగ్రఫేర్ సుందర్ మాట్లాడుతూ ఇది నాకు మొదటి సినిమా, మాది ప్రొపెర్ అంత తమిళనాడు,నాకు ఈ సినిమా లో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
–డైరెక్టర్ బాలు గారు మాట్లాడుతూ అందరి కి నమస్కారం, విశ్వక్ సేన్ చాలా థాంక్స్ పిలవగానే వచ్చినందుకు, ఈ రోజుల్లో అవకాశాలు రావటం లేదు అనుకుంటాం కాని అవకాశాలు వెతుకుతూ ప్రయత్నం చేయాలి, అభిరామ్ గారు ద్వారా ఏవి ఏస్ స్వామి గారిని కలిఫించటం జరిగింది, మా ప్రొడ్యూసర్స్ కధ వినటం జరిగింది, అభిరామ్ గారు, సాత్విక్ గారికి నాకు థాంక్స్, వివేక్ సాగర్ సంగీతం, కాని, పవిత్ర లోకేష్ గారు కాని, TNR గారు ఆయన మన మధ్య లేరు ఆయనతో కలిసి గడిపిన టైం చాలా విలువైనది, మా సినిమా ఆటోగ్రాఫేర్ సుందర్ అందరికి థాంక్స్ చెప్పుకుంటున్నాను అని చెప్పారు.
–అభివర్మ గారు మాట్లాడుతూ ప్రొడ్యూసర్ గారు మూడు సినిమాలు తీశారు కోవిద్ టైం లో మీకు పెద్ద సక్సెస్ రావాలి, విశ్వక్ సేన్ ని ఫలక్ నామ దాస్ లో చూసి చాలా ఇంప్రెస్స్ అయ్యాను, అభి నువ్వు కూడా విశ్వక్ లాగా ట్రాన్స్ఫార్మర్ అవుతుంది రావాలి, నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, సినిమా మంచి విజయం సాధిస్తుంది అని చెప్పారు.
–సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ, టీజర్ వెరీ ఫ్రెష్ గా వుంది, నాలుగు సంవత్సరాలనుండి బాలు తెలుసు,ఈ స్టోరీ నేను చాలా బాగా నమ్ముతున్నాను అని చెప్పి, ఈ సినిమా టీమ్ అందరికి అల్ ది బెస్ట్ చెప్పింది.
–సంజిత్ మాట్లాడుతూ, విశ్వక్ థాంక్స్ మమ్మల్ని విష్ చేయటానికి వచ్చినందుకు,బాలు,అభిరామ్, నాలుగు సంవత్సరాలు నుంచి ఫ్రెండ్స్, బాలు నీతో గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను, రియల్లీ ఫన్ వర్కింగ్ పర్సన్, స్నేహాల్ గారు ఒక్కరోజు కూడా సెట్ కి రాకుండా ఉండటం నేను చూడలేదు అంత హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్ అలాగే ఇక్కడకి వచ్చిన అందరకి థాంక్స్.
ప్రొడ్యూసర్స్ :ఏ వి ఆర్ స్వామి M.SC ( AG ),ఎం. ఆర్. కీర్తన, స్నేహాల్ జంగాల
మ్యూజిక్ :వివేక్ సాగర్
డైరెక్టర్ :బాలు శర్మ
ఎడిటింగ్ :మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ :సుందరం కృష్ణన్
కాస్ట్యూమ్ డిజైనర్ :సంజన శ్రీనివాస్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ :స్మరన్
పి ఆర్ వో :ఏలూరు శ్రీను.మేఘ శ్యామ్