హ‌లో ఎవ‌రు?” మూవీ టీజర్ లాంచ్

119

తెలుగు తెర‌పైకి మ‌రో స‌ర్‌ఫ్రైజ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. శ్రీ‌శివ‌సాయి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై, మ‌హేశ్వ‌రి నందిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో, వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్రం ‘హ‌లో ఎవ‌రు?. ఈ సినిమా ద్వారా హీరో విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం, హీరోయిన్ గా సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ ,విలన్ గా వినాయక్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తర్వలో సెన్సార్ కి వెళ్లనుంది . ఈ క్రైం అండ్ హ‌ర‌ర్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు ద‌ర్శ‌కనిర్మాత‌ వెంక‌ట్‌రెడ్డి నంది తెలిపారు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని, ఇండ‌స్ట్రీలో ఈ చిత్రానికి స్పెష‌ల్ క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. దసరా పండుగ కు రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్శక నిర్మాత వెంక‌ట్‌రెడ్డి నంది తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తుందని, వచ్చే నెలలో ట్రైలర్ ను లాంచ్ చేస్తామని వెంక‌ట్‌రెడ్డి నంది పేర్కొన్నారు.

న‌టీన‌టులు:
విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం(హీరో), సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ (హీరోయిన్), వినాయ‌క్ (విలన్ ), గాదె స‌తీష్, యుగ దుర్గ‌ న‌రేష్ , వేద‌శ్రీ మ‌ల్ల‌, చిత్రం శ్రీ‌ను, ఘ‌ర్ష‌ణ శ్రీ‌నివాస్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, జ‌బ‌ర్‌ద‌స్త్ రాజ‌మౌళి, గ‌బ్బ‌ర్ సింగ్ సాయి, గ‌బ్బ‌ర్ సింగ్ డూప్ రాజ‌శేఖ‌ర్ త‌దిరులు న‌టించారు.

డైలాగ్ రైట‌ర్: ఎల‌కం వీర‌బ్ర‌హ్మ‌
కో-డైరెక్ట‌ర్: అందెల చిరంజీవి
ఎడిటింగ్: సాయి కుమార్ ఆకుల‌, న‌రేష్ దొర‌ప‌ల్లి
డీవోపీ: పి.శ్రీ‌నివాస్
మ్యూజిక్ డైరెక్ట‌ర్: డ్ర‌మ్స్ రాము
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత‌: వెంక‌ట్‌రెడ్డి నంది..