హ్యాపీ బర్త్ డే సెన్సేషనల్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ మారుతి..

325

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ దర్శకులలో మారుతి కూడా ఒకరు. చిన్న సినిమాలు.. పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్ని చేయగల సమర్ధుడు ఈయన. అటు లో బడ్జెట్ సినిమాలైనా.. ఇటు భారీ బడ్జెట్ సినిమాలైనా కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసి నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చేలా చేయడంలో మారుతి అందె వేసిన చేయి. ఈ రోజుల్లో లాంటి చిన్న సినిమాను తన స్నేహితులతో కలిసి చేసిన మారుతి.. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యం నిర్మించుకున్నారు. చిన్న సినిమాలకు ప్రాణం పోయాలనే దాసరి గారి మాటలను నిలబెడుతూ.. తన చేతనైనంత వరకు ఎన్నో మంచి సినిమాలు నిర్మించడం.. కథలు అందించడం చేస్తున్నారు మారుతి. దర్శకుడిగా తనకు స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా చిన్న సినిమాలకు దూరం కాలేదు ఈయన. ఓవైపు పెద్ద సినిమాలు వెంకటేష్, నాని లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తూనే.. మరోవైపు చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు ఈయన.

ఇప్పుడు కూడా గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ సినిమా సెట్‌లోనే బర్త్ డే వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి యూనిట్‌తో సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. అలాగే ఈ సినిమాతో పాటే సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయి సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసి అద్భుతం చేసారు మారుతి. ఈ సినిమా నవంబర్ 4న దివాళీ కానుకగా విడుదల కానుంది. 2012లో ఈ రోజుల్లో సినిమా నుంచి నిన్న మొన్నటి ప్రతిరోజూ పండగే వరకు ఈయన సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కేవలం కామెడీ మాత్రమే కాదు.. ఎమోషన్ కూడా బాగా తెరకెక్కించగలనని ప్రతిరోజూ పండగేతో నిరూపించారు మారుతి. ఇప్పుడు పక్కా కమర్షియల్ అంటూ మరో కమర్షియల్ సినిమాతో వస్తున్నారు. ఈయన ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు అభిమానులు.

Eluru Sreenu
P.R.O