HomeTeluguషూటింగ్ పూర్తి చేసుకున్న హన్సిక '105 మినిట్స్'

షూటింగ్ పూర్తి చేసుకున్న హన్సిక ‘105 మినిట్స్’

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. హన్సిక మోట్వాని కథానాయిక. ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తియిపోయింది. నిర్మాణాంతర కార్యక్రమాలను జరపడానికి చిత్రం యూనిట్ సమాయత్తమవుతోంది. ఈ రోజు (9.8.2022) చిత్ర కథానాయిక హన్సిక పుట్టినరోజు. ఈ సందర్భంగా “105 మినిట్స్” చిత్రం యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే హన్సిక ఫస్ట్ లుక్ ను ప్రముఖ డైరెక్టర్ బాబి విడుదల చేసి, ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సామ్ సి.యస్ సంగీతం సమకూర్చుతున్నారు. కిషోర్ బొయిదాపు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి యాక్షన్ డైరెక్టర్ మల్లి, పిఆర్ఓ రాజ్ కమల్.
సాంకేతిక వర్గం
నిర్మాత – బొమ్మక్ శివ
డైరెక్టర్ – రాజు దుస్సా
డిఓపి – కిషోర్ బొయిదాపు
మ్యూజిక్ – సామ్ సి.యస్
ఆర్ట్ – బ్రహ్మ కడలి
స్ర్కిఫ్ట్ చీఫ్ అసోసియేట్ – రూపాకిరణ్ గంజి
స్టిల్స్ – గుణకర్
మేకప్ – డెక్క బాలు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – సురేష్ బాబు
పబ్లిసిటీ డిజైనర్ – సుధీర్
పిఆర్ఓ – రాజ్ కమల్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES