టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం”. కన్నడలో సక్సస్‌ఫుల్ దర్శకుడు మరియు నటుడు నాగశేఖర్ ని తెలుగుకి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్ మరియు మణికంఠ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చినబాబు, ఎం, సుబ్బారెడ్ది లు సమర్సించగా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు, చిత్రాన్ని డిసెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్, హీరో అడవి శేష్, డైరెక్టర్ సతీష్ వేగేశ్న ల చేతుల వమీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు.వీరితో పాటు ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం
ముఖ్య అతిధిగా వచ్చిన హీరో అడవి శేష్ మాట్లాడుతూ. .సత్య నాకు చాలా మంచి ఫ్రెండ్, నా సినిమా హిట్ అయిన జోష్ లో ఉన్న కూడా సత్య సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. దర్శకుడు నాగ శేఖర్ కు నేను బిగ్ ఫ్యాన్ ని తను కన్నడ లో తీసి బిగ్ హిట్ కొట్టిన “మైనా” సినిమా చాలా ఇష్టం. ఆ సినిమా మాదిరి ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.ఈ సినిమాకు కాలభైరవ ఇచ్చిన మ్యూజిక్ ను అందరూ ప్లే లిస్ట్ లో పెట్టుకొని వినే విధంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు.. నేనెప్పుడో తమన్నాతో యాక్టింగ్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు. మంచి కథతో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ కూడా ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ..ఈ సినిమా చూశాను సత్య అద్భుతమైన యాక్టింగ్ చేశాడు. ఇందులో నటించిన తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్ అందరూ చాలా బాగా నటించారు. ఈ సినిమాకు ప్రాణం మ్యూజిక్. కాలభైరవ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. దర్శక నిర్మాతలు అందరూ కష్టపడి చేసిన ఈ సినిమా శీతాకాలంలో రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది డిసెంబర్ 9న యూనిట్ అందరికీ గొప్ప రోజు అయ్యి బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
డైరెక్టర్ సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. “గుర్తుందా సీతాకాలం” టైటిల్ అచ్చమైన తెలుగు పదం. చాలా తక్కువ తెలుగు టైటిల్స్ వస్తున్న ఈ రోజుల్లో ఈ టైటిల్ రావడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ట్రైలర్స్ చూస్తుంటే నాకు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ గుర్తుకువస్తుంది. జీవితంలో చాలామంది స్నేహితులు కలుస్తారు శత్రువులు కలుస్తారు ఎంతమంది కలిసిన ఉండే తొలిప్రేమ, కాలేజీ లైఫ్, టీనేజ్ లైఫ్, ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు వస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా కూడా అలాంటి తీపి గుర్తులను తీసుకు వస్తుందని కోరుకుంటూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ..మా సినిమా బ్లెస్స్ చేయడానికి వచ్చిన శ్రీ కళ్యాణ్ గారికి, సతీష్ గారికి, శేషు గారికి ధన్యవాదాలు. శేషు చేసే ప్రతి సినిమా కూడా ప్రాణం పెట్టి ఎంతో కష్టపడి చేస్తాడు. అందుకే తను చేసిన సినిమాలన్నీ హిట్ సాధిస్తాడు.తను మా ఫంక్షన్ కి వచ్చాడు అంటే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. తమన్నా లాంటి బిగ్ యాక్ట్రెస్ తో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ సినిమా నాది అనుకుంటారు. కానీ ఈ సినిమా తమన్నా, గ కావ్య శెట్టి, మెగా ఆకాష్ లది.వీళ్ళు ముగ్గురు మధ్యలో నేను నటిస్తున్నాను.భూపాల్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు.నాగ శేఖర్ గారు చాలా మంచి వ్యక్తి తనుకు ఎన్ని సమస్యలు ఉన్నా మాకు ఫుల్ ఎనర్జీ నింపుతూ మాతో ఒక చక్కటి నటనను రాబట్టుకొన్నాడు.ఈ సినిమా చూసిన వారందరూ కచ్చితంగా స్మైల్ తో బయటకు వస్తారు.
ఈ సినిమా కొరకు నన్ను నమ్మి సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాత లకు ధన్యవాదములు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాను లవ్ స్టోరీ ఉన్న వాళ్ళు, లవ్ స్టోరీ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం “గుర్తుందా శీతాకాలం”ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది
మిల్క్ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ..ఇప్పటివరకు నాకు శీతాకాలం అంటే ఇష్టం లేదు నాకు సమ్మర్ అంటే ఇష్టం.కానీ ఈ సినిమాలో యాక్ట్ చేశాక చాలా బ్యూటిఫుల్ విజువల్స్ చూశాను. కాలభైరవ తన మ్యూజిక్ తో సినిమాకు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. నాగ శేఖర్ గారు అద్భుతమైన దర్శకుడు. ఇంతకుముందు నేను సత్యదేవ్ గారి ఉమామహేశ్వర సినిమా చూశాను. అప్పుడే అనిపించింది తనతో సినిమా చేయాలని కానీ ఇంత త్వరగా చేస్తాను అనుకోలేదు. డిసెంబర్ 9న వస్తున్న ఈ సినిమాను అందరూ చూసి చేయాలని కోరుకుంటున్నాను అన్నారు
చిత్ర నిర్మాత రామారావు చింతపల్లి మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సి. కళ్యాణ్, అడవి శేష్ లకు ధన్యవాదములు..సహజ నటనకు ప్రతిరూపమైన హీరో సత్యదేవ్, మిల్క్ బ్యూటీ తమన్నా, మెఘా ఆకాష్, కావ్య శెట్టి లు ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరచారు , చీకట్లను చీల్చుకుంటూ వచ్చే వెలుగుల సంగీత బాణీలు అందించిన కాలభైరవ గారికి,మాటల మూటలతో మా చిత్రాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లిన లక్ష్మీ భూపాల్ అన్న గారికి మా తదుపరి చిత్రం “శ్రీ శ్రీ శ్రీ రాజా వారి” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వేగేశ్న సతీష్ గారికి, నాకు సపోర్ట్ గా నిలిచిన జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్
రంగాపురం రాఘవేంద్ర గారికి, చింతలపాటి మురళీకృష్ణ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను
కన్నడలో విభిన్నమైనటువంటి సినిమాలకు దర్శకత్వం వహించి అద్భుతంగా విజయాలను సాధించినటువంటి కన్నడ డైరెక్టర్ నాగ శేఖర్ ఈ సినిమాను చాలా చక్కగా చిత్రీకరించడం జరిగింది. మంచి కథతో వచ్చిన ఈ సినిమాను ఎవరు దర్శకత్వం వహించారు అనే విధంగా సినిమా చాలా బాగుంటుంది.ఈ చిత్రం సినిమా చూసిన తర్వాత ఇప్పుడు వస్తున్న చిత్రాల్లోనే చిత్రరాజం అవుతుందనిపించింది ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మా సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని గర్వంగా ఫీల్ అవుతున్నాము అన్నారు.
చిత్ర సమర్పకులు చిన్న బాబు మాట్లాడుతూ..మా కార్యక్రమానికి వచ్చిన సి.కళ్యాణ్, అడవి శేషు,సతీష్ వేగేశ్న లకు ధన్యవాదాలు. శీతాకాలం జర్నీ చాలా బాగుంటుంది.ఈ సినిమాకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందనేది అన 100% కాన్ఫిడెంట్గా చెప్పగలము. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూసే విదంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా డెఫినెట్గా బావుంటుంది. డిసెంబర్ 9 న వస్తున్న మా సినిమాను బ్లెస్స్ చేసి మా సినిమాను చూడాలని కోరుకుంటున్నాం అన్నారు.
చిత్ర దర్శకుడు నాగ శేఖర్ మాట్లాడుతూ నేను చేసిన కంటిన్యూ సినిమాలను బ్లాక్ బస్టర్ చేసిన కన్నడ ప్రేక్షకులకు మరియు ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాను కూడా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాను చాలా అందంగా తీశాము. ఇంత అందంగా రావడానికి కారణం సత్యదేవ్ తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్ లు కథ బాగుంటే భాష అవసరం లేదని ఈ కథ చెబుతుంది.కాల కాలభైరవ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు మంచి కథతో వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మరో నిర్మాత భావన రవి మాట్లాడుతూ..మేము తీసిన ఈ సినిమాను డైరెక్టర్ నాగశేఖర్ చాలా బాగా తీశాడు. ఈ సినిమా తర్వాత తెలుగులో తను పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాలో నటించిన తమన్నా మెఘా ఆకాష్, కావ్య శెట్టి, దర్శి అందరు కూడా చాలా బాగా కోపరేట్ చేశారు వీళ్ళు అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. ఈ నెల 9 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు బిగ్ హిట్ చెయ్యాలని కోరుతున్నాను అన్నారు
గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ శరణ్ మాట్లాడుతూ..ఈ సీతకాలంలో కాలంలో వస్తున్న అందమైన సినిమా గుర్తుందా శీతాకాలం.ఈ సినిమాకు కాలభైరవ ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు. డిసెంబర్ 9 న ఈ శీతాకాలంలో వస్తున్న “గుర్తుందా శీతాకాలం” టీమ్ అందరికీ మంచి జ్ఞాపకం గా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ డిసెంబర్ 9 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
నటీనటులు:
సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని తదితరులు
సాంకేతిక బృందం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – నాగశేఖర్
బ్యానర్ – వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పకులు – ఎం.ఎస్.రెడ్డి, చినబాబు
నిర్మాతలు – రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్
కొరియోగ్రఫీ – విజె శేఖర్
లైన్ ప్రొడ్యూసర్స్ – సంపత్, శివ S. యశోధర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నవీన్ రెడ్డి
డైలాగ్స్ – లక్ష్మీ భూపాల్
సంగీతం – కాలభైరవ
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రాఫర్ – సత్య హెగ్డే
విన్యాసాలు – వెంకట్
పిఆర్‌ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్