చిరంజీవి విడుద‌ల చేసిన ‘గ‌ల్లీ రౌడీ’ ట్రైల‌ర్‌.. సెప్టెంబ‌ర్ 17న సినిమా గ్రాండ్ రిలీజ్‌

412

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమా థియేట‌ర్స్‌లో చాలా సినిమాలు వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాయి. అయితే మేం ఏకంగా న‌వ్వులతో సెప్టెంబ‌ర్ 17న‌ దాడి చేయ‌బోతున్నాం అని అంటున్నారు ‘గ‌ల్లీరౌడీ’ అండ్ టీమ్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లే అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు.

ప‌క్కా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అన్ని ఎలిమెంట్స్ ఉన్న విందుభోజ‌నంలా ప్రేక్ష‌కుల‌ను సంతోష‌పెట్ట‌డానికి సెప్టెంబ‌ర్ 17న మీ ద‌గ్గ‌రున్న థియేట‌ర్స్‌లో గ‌ల్లీరౌడీ సంద‌డి మొద‌లు కానుంది. ఈ న‌వ్వుల సంద‌డికి శాంపిల్ ఎలా ఉంటుందో చూపించడానికి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్.

ట్రైలర్‌లోనే ఈ రేంజ్ కామెడీ ఉంటే, ఇక సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో క్రియేట్ చేసేలా ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా, ఎంట‌ర్‌టైనింగ్‌గా క‌నిపిస్తుంది. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు.

న‌టీన‌టులు:
సందీప్ కిష‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా
స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి
నిర్మాత‌: ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌
స‌హ నిర్మాత‌: జి.వి
సంగీతం: చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌
స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌
క‌థ‌: భాను
ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌
స్టైలిష్ట్‌: నీర‌జ కోన‌
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా