HomeTeluguగ్రాండ్ గా జరిగిన కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ "గ్రంథాలయం"ప్రి రిలీజ్ ఈవెంట్. మార్చి 3 న...

గ్రాండ్ గా జరిగిన కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ “గ్రంథాలయం”ప్రి రిలీజ్ ఈవెంట్. మార్చి 3 న గ్రాండ్ రిలీజ్

వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ “గ్రంథాలయం”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలు గా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్, బిగ్ బాస్ ఫెమ్ వినయన, బి. వి. యస్ రవి, ఓబుళ సుబ్బారెడ్డి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, డి. యస్. రావ్ తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. బి. వి .యస్ రవి, బెక్కం వేణుగోపాల్ చేతుల మీదుగా గ్రంధాలయం బిగ్ టికెట్ లాంచ్ చేయడం జరిగింది.

గ్రంధాలయం ప్రమోషన్ లో భాగంగా రెండు తెలుగు రాష్టాలలో ఒక క్యాంపైన్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంధాలయం టీం ఇచ్చిన క్లూ ను గెస్ చేసిన వారిలో కొందరిని సెలెక్ట్ చేసి వారిలోని 10 మందికి సిల్వర్ కీ చైన్, విన్నర్ అయిన వారికి 1 గోల్డ్ కీ చైన్ ఇవ్వడం జరుగుతుంది. ఆలా విన్ అయిన గణేష్ అనే వ్యక్తి కి లక్ష రూపాయల గోల్డ్ కీ చైన్ ఇస్తామని చిత్ర నిర్మాత అనౌన్స్ చేయడం జరిగింది.

విన్నర్ అయిన గణేష్ మాట్లాడుతూ..ఈ క్యాంపెయిన్ పార్టీసీపేట్ చేసి గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది..మార్చి 3 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ..డైరెక్టర్ ఎంతో తపన పడి తీసిన ఈ సినిమాలో అందరూ యంగ్ టీం ను సెలెక్ట్ చేసుకొని చాలా బాగా తీశాడు. నిర్మాత చేసిన మొదటి ప్రయత్నం సక్సెస్ కావాలి. హీరో శేఖరం అబ్బాయి ద్వారా నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్, టీజర్, పాటలు బాగున్నాయి. మార్చి 3 న వస్తున్న ఈ సినిమా మాస్ హిట్ అయ్యి దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత అయ్యప్ప అల్లం నేని మాట్లాడుతూ.. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ నచ్చే విధమైన కంటెంట్ మా “గ్రంధాలయం” సినిమాలో ఉంటుంది.మార్చి 3న వస్తున్న మా సినిమా థియేటర్లో రిలీజ్ అవుతున్న మా సినిమాను ప్రతి ఒక్కరూ మా సినిమాను చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకులు సాయి శివన్ మాట్లాడుతూ..కల కన్న కథ ఇది అని ఇంతకుముందే చెప్పాను.నేను సినిమా చేద్దాం అని కలలు కన్నాను కానీ నా కొచ్చిన కలను కథగా రాస్తాను అనుకోలేదు.ఆలా రాసేలా ప్రెరేపించిన కథే “ది మహా తంత్ర్ మిస్ట్రీ అఫ్ డెత్”.ఇది కొత్త కంటెంట్ చాలా స్టాంగ్ గా ఉంటుంది.హీరో విన్ను నేను “వైరం” సినిమా ద్వారా కలుసుకున్నాము.ఆసినిమాను తెలుగు, కన్నడ బైలింగ్వేల్ లో చేశాము. ఆ సినిమా చేస్తున్నప్పుడు హీరో విన్ను కు ఈ సినిమా లైన్ చెప్పడం జరిగింది.
దాంతో రెండు సినిమాలు ప్యార్లల్ గా చేస్తున్న మాకు కరోనా రావడంతో కొంచెం ఇబ్బంది పడ్డాము. కరోనా తర్వాత ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేశాము.నన్ను, విన్ను ను నమ్మి వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ వారు ఖర్చుకు వెనుకడకుండా ఈ సినిమా నిర్మించారు.ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు మేము రుణపడి ఉంటాము. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు చాలా మంచి పాటలు ఇచ్చారు.సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ కాన్సెప్టు ను కమర్షియల్ గా ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ఇందులో మాస్ కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించి బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

చిత్ర హీరో విన్ను మాట్లాడుతూ… నేను శేఖరం గారి అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడు నాకు చిన్న బ్రేక్ పడింది.దాంతో సినిమా ఆగిపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న నాకు మా చెల్లి చాలా సపోర్ట్ గా నిలిచింది.తన సపోర్ట్ వల్లే నేను ఈ రోజు హీరో గా నిలాదొక్కుకున్నాను. ఆ సినిమా తర్వాత డైరెక్టర్ సాయి శివన్ పరిచయం అవ్వడం జరిగింది. తను చెప్పిన వైరం కథ నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాము.ఆ సినిమా చేస్తున్నప్పుడే “గ్రంధాలయం” కథ చెప్పడం జరిగింది. ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఈ సినిమా చేస్తున్నప్పుడే తనకు యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డాడు.అయినా
తను చాలా హార్డ్ వర్క్ వర్క్ చేసి సినిమా కంప్లీట్ చేశాడు. తను ఇలాంటి సినిమాలు ఎన్నో చేసి గొప్ప దర్శకుడు అవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఫైట్స్ బాగా వచ్చాయి. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. “గ్రంథాలయం” సినిమా మార్చి 3 న రిలీజ్ అవుతుంది.అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను

హీరోయిన్ స్మిరితరాణిబోర మాట్లాడుతూ.. చాలా మంచి సినిమా ఇది.ఇలాంటి మంచి సినిమా ద్వారా తెలుగులో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.

నటీనటులుః
విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా, కాశీశినాథ్‌, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ ::వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ః) : అల్లంనేని అయ్యప్ప,
రచన దర్శకత్వం : సాశివన్‌జంపాన.
సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్‌,
సంగీతం : వర్ధన్‌,
ఎడిటర్‌ : శేఖర్‌పసుపులేటి,
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ఃల్ : చిన్నా,
ఆర్ట్‌డైరెక్టర్‌ : రవికుమార్‌ మండ్రు,
లైన్ ప్రొడ్యూసర్ : మహేష్
పి. ఆర్. ఓ : దీరజ్, ప్రసాద్


Eluru Sreenu,SHYAM
P.R.O

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES