హీరోయిన్ హేమలత రెడ్డికి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు వచ్చిన సందర్భంగా హైదరాబాదులో గ్రాండ్ సెలబ్రేషన్స్

30

జెమినీ టీవీ యాంకర్ గా చేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు. కిరీటం గెలిచిన తర్వాత హేమలత రెడ్డి తన గ్లోరీ కిరీటంతో అంతర్జాతీయ షూట్ చేసారు మరియు గ్లామన్ డైరెక్టర్ శ్రీమతి మన్ దువా కూడా అక్కడ ఉత్సాహంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. తర్వాత హేమలత రెడ్డి మన్ దువా మేడమ్‌తో కలిసి బటుకేశవరా ఆలయాన్ని సందర్శించారు. ఈ నెల 28న హైదరాబాద్ కి తిరిగి వచ్చిన తర్వాత గచ్చిబౌలి లోని డెక్కన్ సరై గ్రాండ్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ చేశారు.

ఈ సందర్భంగా హీరోయిన్ హేమలత రెడ్డి మాట్లాడుతూ : నేను ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉన్నాను. జెమిని టివి లో ఒక యాంకర్ గా మొదలుపెట్టి సీరియల్స్ చేశాను, ఆ తరువాత ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ తో ప్రొడ్యూసర్ కావాలి అనుకుని ఒక సినిమా తీశాను. ఆ తర్వాత కోవిడ్ టైంలో ఫ్యాషన్ సైడ్ ట్రై చేశాను. సెలెక్ట్ అయ్యి రౌండ్స్ అన్ని వర్చువల్ గా కంప్లీట్ చేశాను. ఫైనల్ సెలక్షన్స్ కి మలేషియా వెళ్లాను. అక్కడ కాంపిటీషన్ చాల టఫ్ గా నడిచింది. దక్షిణాది నుండి నేను మాత్రమే వెళ్లగలిగాను. చివరిగా గెలిచాను. మన మాతృ భాష తెలుగులోనే నేను అక్కడ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. నేను గెలుస్తను అని అనుకోలేదు. అక్కడ నార్త్ & సౌత్ అనే పార్షియలిటీ లేదు. అటు నటన, అలాగే ఇటు గ్లామర్ రెండు కష్టమైన పనులే. నేను ప్రొడ్యూసర్ గా హీరోయిన్ గా చేసిన సినిమా నిన్ను చూస్తూ. ఆ సినిమాలో సుహాసిని గారు, సుమన్ గారు, సయాజి షిండే గారు లాంటి సీనియర్ నటులతో నటించాను. వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా సుహాసిని గారు ఎన్నో మంచి టిప్స్ ఇచ్చారు. ఆవిడ నాకు ఇన్స్పిరేషన్. అలాగే నాకు మా కుటుంబం నుండి మంచి సపోర్ట్, ముఖ్యంగా మా నాన్న నాకు చాల సపోర్ట్ గా నిలిచారు. NTV, TV9 లో కూడా నేను పని చేశాను. ఆడవారు గ్లామర్ గా మాత్రమే కాదు, ప్రతి రంగంలో ముందుండాలి. ఆఫర్ వాస్తే ఎలాంటి రోల్స్ అయిన చేస్తాను. నా సినిమాని మీడియా చాలా సపోర్ట్ చేశారు ఇప్పుడు నా కెరియర్ ని నేను ఫ్యూచర్ లో చేసే రోల్స్, సినిమాలను కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

గ్లామన్ డైరెక్టర్ శ్రీమతి మన్ దువా మాట్లాడుతూ : గ్లామన్ మిస్ అండ్ మిస్సెస్ ఇండియా పోటీని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. 39 సిటీలలో 60 మంది కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసాం. 35 మందిని మలేషియా తీసుకెళ్లాం. టైటిల్ విన్నర్ గా మీ హైదరాబాద్ అమ్మాయి హేమలత రెడ్డి గెలిచారు. చాలా టఫ్ కాంపిటీషన్ నడిచింది విన్నర్ ని సెలెక్ట్ చేయడం చాలా కష్టమైంది. ఇక ఇప్పుడు గ్లామన్ మిస్ అండ్ మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ చేస్తున్నాం. 149 దేశాల నుంచి ఎంట్రీస్ ని తీసుకుంటున్నాం. ఆ ఫినాలేని ప్యారిస్ లో ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అంతే కాక ఈ గ్లామన్ అవార్డు గెలుచుకున్న హేమలత రెడ్డి గారిని త్వరలోనే పారిస్ కు తీసుకొని వెళ్ళబోతున్నాము అని మన్ దువా తెలిపారు.