బ్రో… సినిమా మామూలుగా లేదు బ్రో.. అయ్య బాబోయ్ అదిరిపోయింది.. మామూలుగా లేదు బ్రో.. అని చొక్కాలు చింపుకునే బ్యాచ్ ఒకటి ఐమాక్స్ థియేటర్ వద్ద ప్రతి శుక్రవారం కనిపిస్తుంది. కానీ ఇతను ప్రత్యేకం ‘స్పీడుగా వెళ్తుంది విస్పా.. వచ్చింది పుష్పా’.. ‘లేస్తుంది లేస్తుంది పుష్పక విమానం లేస్తుంది’.. ‘ఇంటింటికీ కావాలి జాబు.. వస్తున్నాడు మహేష్ బాబు’.. ఈ కొటేషన్స్ వింటే అతను గుర్తొచ్చేస్తాడు అతనే లక్ష్మణ్. ఇతని అసలు పేరు లక్షణ్ టేకుమూడి.
ఒక మామూలు రేవ్యూయర్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదిగి, ఇప్పుడు సినిమాలో మంచి పాత్రలతో మనముందుకు వస్తున్నాడు. ఇంతలోనే తన మీద నమ్మకంతో ఒక ప్రైవేట్ సాంగ్ తీయడం జరిగింది. అతన్ని ఫేమస్ చేసిన లైన్ BRO నే వాడుతూ హాష్టాగ్ బ్రో అనే సాంగ్ ని నిన్న హైదరాబాద్ గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా సంగీత దర్శకుడు రఘు కుంచే, కమెడియన్ రచ్చ రవి, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ మరియు శ్రిని ఇన్ఫ్రా చైర్మన్ విచ్చేశారు.
చాలా మంది ఇన్స్ట్ గ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ర్లు కూడా అక్కడికి వచ్చి లక్ష్మణ్ టేకుముడి నీ చూసి గర్వంగా ఫీల్ అయ్యారు. హష్ఠగ్ బ్రో సాంగ్ కంపోజ్ చేసి దానిని పాడింది మన తెలుగు రాప్పర్ రోల్ రైడా. మీమర్స్ కంటెంట్ మరియు ట్రెండింగ్ కంటెంట్ లిరిక్స్ తో అందర్నీ ఆకటుకుంటుంది ఈ పాట. అంతేకాకుండా దీనికి రాహుల్ శ్రీవాత్సవ గారు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు అందుకే విజువల్స్ అంత రిచ్ గా ఉన్నాయి.
అక్కడికి వచ్చిన అతిథులు, ఇన్ఫ్లుయెన్స్ ర్లు అందరూ లక్ష్మణ్ కష్టాన్ని పోగుడుతు అతనికి ఇంకెన్నో సక్సెస్స్ లు రావాలని కోరుకున్నారు. ఈ సాంగ్ నీ డైరెక్ట్ చేసింది మైథిలి కట్ట మరియు ప్రొడ్యూస్ చేసింది కట్ట అరుణా శ్రీ. దీనికి లిరిక్స్ కూడా రోల్ రైడా నే అందించడం విశేషం.
కొరియోగ్రఫీ : రాజ్ కృష్ణ
ఎడిటర్ : నరేష్ వేనువంక
పవర్డ్ బై : బ్లాక్బస్టర్ బెవరేజ్స్
స్పాన్సర్స్ : హస్తిన రియల్ ఎస్టేట్
కో స్పాన్సర్స్ : అర్రివ్ అబ్రాడ్ ఏడ్యుకేషనల్ కన్సల్టెన్సీ
ఈవెంట్ పార్టనర్ : యు మీడియా ఎంటర్టైన్మెంట్
మీడియా పార్టనర్. : రోల్ మీడియా
లొకేషన్ పార్టనర్ : ట్రొప్స్ పబ్ మాధపుర్
వెన్యు పార్టనర్: డేట్ కేఫ్ & లౌంజ్
రేడియో పార్టనర్ : 91.1 FM రేడియో సిటీ
పబ్లిసిటీ పార్టనర్ : రోల్ మీడియా
ప్రత్యేక ధన్యవాదాలు : శ్రీని ఇన్ఫ్రా, స్వప్నేస్ చింతల