ఆకట్టుకున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ గ్లింప్స్

115

యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా ఒక గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా ఆ గ్లింప్స్ సినిమా మీద ఒక్క సారిగా బజ్ పెరిగి పోయింది. ‘తెల్లవారు జామున మంచు పోగలాంటి ప్రేమ అనే వలయంలో చిక్కుకున్న ప్రేమికుల కోసం ఈచిత్రం’ తో ఆ గ్లిమ్ప్స్ ఆకట్టుకునే విధంగా వీడియో సాగుతోంది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకుంది. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ మరియు శ్రీనాథ కథలు సంయుక్తంగా అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమా శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ గారు లిరిక్స్ అందించారు . నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎడిటింగ్ కోదాటి పవన్ కళ్యాణ్. వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించేలా ఈ సినిమా రూపొందించామని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ దొరుకుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు.