ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత విలక్షణ దర్శకుడు మారుతి చేయబోయే సినిమా పై అంతటా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే, ఆ ఉత్కంఠకి తెర దించుతూ ఇటీవలే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకుంటూ మందుకు సాగతున్న జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను ఎనౌన్స్ చేశారు దర్శకుడు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ వరుకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. ఇదే రీతిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని కీలక ప్రకటణలను సైతం దర్శకుడు మారుతి తనదైన శైలిలో విడుదల చేస్తూ వచ్చారు. ఈ చిత్ర విడుదల తేదీని కార్టూన్ క్యారకేచర్లు వాడుతూ వినూత్నంగా ప్రకటించడం కూడా అందర్నీ ఆకట్టుకుంది.
తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ క్వార్టర్స్ లో మొదలైంది. ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – మారుతి కాంబినేషన్ సెట్ అయింది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు జి ఏ2 పిక్చర్స్, యూ వి క్రియేషన్స్ లో భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతిరోజు పండుగ తో హాట్రిక్ రాగా ఇప్పుడు డబల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతూ గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా పక్కా కమర్షీయల్ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది, ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు, ఎస్ కే ఎన్ సహ నిర్మాత. ఇందులో హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే అధికారిక ప్రకటణ రానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియ జేయనుంది.
హీరో – గోపీచంద్
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్ – జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్
నిర్మాత – బన్నీవాసు
ఆర్ట్ – రవీంద్ర
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
మ్యూజిక్ – జకేస్ బీజాయ్
సినిమాటోగ్రఫి – కరమ్ చావ్ల
ఎడిటింగ్ – ఎస్ పి ఉద్భవ్
సహ నిర్మాత – ఎస్ కే ఎన్
దర్శకుడు – మారుతి
—
Thanks & Regards,
Eluru Sreenu
P.R.O