ప్రతి రోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకుంటూ మందుకు సాగతున్న జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరుకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. ఇదే రీతిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని కీలక ప్రకటణలను సైతం దర్శకుడు మారుతి తనదైన శైలిలో విడుదల చేస్తూ వచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సింహ భాగం పూర్తయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు, అల్లు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోల్లో ప్రస్తుతం పక్కా కమర్షీయల్ షూటింగ్ జరుగుతుంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుటికే విడుదలైన పోస్టర్లలో కూడా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియ జేయనుంది.
ఆగస్ట్ 3, 2021తో తెలుగు చిత్ర సీమకు అడుగుపెట్టి రెండు దశాబద్ధాలు పూర్తి చేసుకోబోతున్న గోపీచంద్
తారాగణం; గోపీచంద్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్
టెక్నికల్ టీం:
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్ – జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్
నిర్మాత – బన్నీ వాస్
దర్శకుడు – మారుతి
ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్
మ్యూజిక్ – జకేస్ బీజాయ్
సహ నిర్మాత – ఎస్ కే ఎన్
ఎడిటింగ్ – ఎన్ పి ఉద్భవ్
సినిమాటోగ్రఫి – కరమ్ చావ్ల
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
—
Eluru Sreenu
P.R.O