HomeCeleb Interviews'గాడ్ ఫాదర్'' విజయం మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయలనే ఉత్సాహాన్ని ఇచ్చింది: మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ

‘గాడ్ ఫాదర్” విజయం మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయలనే ఉత్సాహాన్ని ఇచ్చింది: మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి ”గాడ్ ఫాదర్” గ్రాండ్ సక్సెస్ ని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.

మీ జీవితంలో చాలా విజయాలని , బ్లాక్ బస్టర్స్ ని చూశారు.. గాడ్ ఫాదర్ విజయం ఎంత ప్రత్యేకమైనది?

సినిమాని సమిష్టి కృషి అని నమ్ముతాను. ఒక విజయం వెనుక సమిష్టి కృషి వుంటుంది. అందుకే ఒక విజయం కేవలం నాదీ అని అనుకోను. ఏప్రిల్ లో వచ్చిన గత చిత్రం నిరాశ పరిచింద. దానికి చేయాల్సిన ధర్మం చేశాను. దానిని చెప్పుకుంటే చిన్నదైపోతుంది. చాలా పెద్ద మొత్తం నాది కాదని వదిలేశాను. రామ్ చరణ్ కూడా వదిలేశాడు. నేను వదులుకున్నది బయ్యర్లుని కాపాడుతుందనే సంతృప్తి నన్ను ఫ్లాఫ్ కి క్రుంగిపోయేలా చేయలేదు. గాడ్ ఫాదర్ విజయం కూడా కేవలం నాదీ అని అనుకోను. గాడ్ ఫాదర్ విజయం సమిష్టి కృషి. చేస్తానని చాలా ఉత్సాహంగా చెప్పారు. రచయిత సత్యనంద్ తో కూర్చుని టీం అంతా చాలా చక్కని మార్పులు చేర్పులు చేసి గాడ్ ఫాదర్ ని అద్భుతంగా మలిచారు.

గాడ్ ఫాదర్ చూసి ఇండస్ట్రీ నుండి మీ మిత్రులు ఎలా స్పందించారు ?
నాగార్జున, వెంకటేష్.. ఇలా దాదాపు అందరూ కాల్ చేసిన మాట్లాడారు. దాదాపు దర్శకులు, మిత్రులు అభినందనలు తెలుపుతూ అనందం వ్యక్తం చేశారు.

సాంగ్స్ , డ్యాన్స్ లు లేవు కదా అభిమానుల నుండి ఎలాంటి స్పందన వుంది ?
పవర్ ఫుల్ సబ్జెక్ట్ ఇది. ఇలాంటి సబ్జెక్ట్ లు చేస్తే బావుటుందనే మాటే తప్ప సాంగ్స్ , డ్యాన్స్ లు లేవని ఎక్కడానెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా చూసినపుడు పాటలు లేవనే భావం కలగలేదు. దీనికి కారణం తమన్. నేపధ్య సంగీతంతో ప్రాణం పోశారు. యాక్షన్ సీన్స్ కి ఇంత హై రావడానికి కారణం తమన్ మ్యూజిక్. ఈ సినిమాని గాడ్ ఫాదర్ అనే టైటిల్ సూచించింది కూడా తమనే.

లూసిఫర్ తో పోల్చుకుంటే గాడ్ ఫాదర్ లో చాలా మార్పులు చేశారు ? ఇలా మార్పులు చేసినప్పుడు ఒరిజినల్ దెబ్బ తింటుందనే భయం కలగలేదా ?

ఎలాంటి మార్పులు చేస్తే ఫ్రెష్ గా ఆసక్తికరంగా వుంటుందనే ఆలోచనతో పని చేశాం. ఇది పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా ఆసక్తికరంగా వుంటుందో లేదో తెలీదు. అయితే దిని వెనుక బలమైన ఎమోషన్ వుంది. బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ప్రధానంగా ఉంటూ మరో లేయర్ లో పొలిటికల్ డ్రామా వుండాలని మొదటరోజే అనుకున్నాం. మలయాళంలో సొంత కొడుకా కాదా అనే అనుమానం వుంటుంది. కానీ గాడ్ ఫాదర్ లో సొంత కొడుకని చాలా క్లియర్ గా చెప్పాం. అలాగే బ్రదర్ ని సిస్టర్ ఎందుకు ద్వేషిస్తుందో కూడా వివరంగా చూపించాం. అలాగే తన సిస్టర్ ని బ్రహ్మ పార్టీ ప్రెసిడెంట్ చేయడం కూడా చాలా ఆసక్తికరమైన సన్నివేశం అయ్యింది. ఈ మార్పులన్నీ మోహన్ రాజా అద్భుతంగా చేసి ప్రేక్షకులని కట్టిపడేశారు. మనం అనుభవంతో ఏదైనా మార్పు చెబితే మోహన్ రాజా దాన్ని చాలా గొప్ప గా స్వాగతించి దాని గురించి ఆలోచిస్తాడు. ఇది అతనిలో చాలా మంచి లక్షణం. రీమేక్ సినిమా చేయడం ఒక సవాల్. చాలా పోలికలు వస్తాయి. అయితే ప్రేక్షకుల ఆదరణ వలన ఒరిజినల్ ని మర్చిపోయేలా చేయగలుగుతున్నాం. ఘరానామొగుడు, ఠాగూర్ .. చిత్రాలు గొప్ప విజయాలు అందుకొన్నాయి. రిమేక్ కథలలో నా పాత్ర, ప్రజంటేషన్ సరికొత్తగా వుంటుంది. ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వుంటుంది. (నవ్వుతూ) గాడ్ ఫాదర్ లో కూడా అది అద్భుతంగా కుదిరింది.

సైరా మీ డ్రీమ్ కదా .. అలాంటి పాత్రలు ఇంకెమైనా చేయాలనీ ఉందా ?
మైత్రీ మూవీ మేకర్స్ , బాబీ దర్శకత్వంలో రాబోతున్న 154లో నా నుండి కోరుకునే పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ వుండే చిత్రంగా ఆకట్టుకుంటుంది. అలాగే భోళా శంకర్ లో కూడా మంచి మార్పులతో అద్భుతమైన వినోదం వుంటుంది.

యువ దర్శకులతో పని చేయడం ఎలా వుంది ?
ఇప్పుడున్న యువ దర్శకులకు అన్ లిమిటెడ్ సమాచారం వుంది. కొత్త విషయాలని చాలా చక్కగా అపరిమితంగా నేర్చుకుంటున్నారు. వారికీ కోరుకున్నది ప్రజంట్ చేయడానికి పుష్కలమైన అవకాశాలు వున్నాయి. నా ఇమేజ్, వారు కొత్త గా చూపించే విధానం ఈ కాంబినేషన్ బావుటుందని నమ్ముతాను. అందుకే యువ దర్శకులతో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతాను.

మీరు పవన్ కళ్యాణ్ కలసి నటించే అవకాశం ఉందా ?
మా తమ్ముడి తో చేయాలనే సరదా నాకు వుంటుంది. అన్నయ్యతో చేయాలని తనకీ వుంటుంది. అన్నీ కుదిరిన రోజున కలసి సినిమా చేయాలనీ నాకు చాలా ఉత్సాహంగా వుంది.

సల్మాన్ ఖాన్ గారు గాడ్ ఫాదర్ చేశారు కదా మీకూ వేరే పరిశ్రమ నుండి అవకాశం వస్తే చేస్తారా ?
తప్పకుండా చేస్తాను. అందరూ చేయాలని కోరుతాను. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా ‘ఇండియన్ సినిమా’ అనే పేరు రావాలని నా కోరిక. బాహుబలి, కే జీ ఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఎల్లలు చేరిగిపోయాయనే భావిస్తాను. ఇది మంచి పరిణామం.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES