యస్.యమ్. కె ఫిలిమ్స్ మరియు వి.యన్.ఆర్.ఫిలిమ్స్ పతాకాలపై మోహన్ కృష్ణ ,వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ ,హీరో హీరోయిన్లుగా రాజుబాబు దర్శకత్వంలో యస్.యమ్. కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం ఘరానా మొగుడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ మణికొండ లోని శివాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు సాగర్ గారు హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశం పై గౌరవ దర్శకత్వం వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు,జెమిని సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏ.ఎస్ రవికుమార్ గారు స్క్రిప్ట్ అందించారు. పూజా కార్యక్రమాల అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో
*తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ* ..మోహన్ గారు చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా టైటిల్ తో తను సినిమా తీస్తున్నాడు. చిరంజీవి గారి ఘరానా మొగుడు ఎంత ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు తను తీస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని అన్నారు .
*దర్శకుడు సాగర్ మాట్లాడుతూ*… మోహన్ కృష్ణ నాకు మంచి మిత్రుడు తను డిఫరెంట్ సబ్జెక్ట్ ను సెలక్ట్ తీసుకొని మూవీ తీస్తాడు. వాణి విశ్వనాథ్ నా చిత్రంలో నటించింది.ఇప్పుడు ఈ ఘరానా మొగుడు చిత్రంలో వాణి విశ్వనాథ్ కూతురు వర్శ విశ్వనాథ్ నటిస్తున్నందంటే ఇది నాకు సొంత బ్యానర్ లాంటిదే ఈ చిత్రం మోహన్ కు, వర్శ విశ్వనాథ్ కు మంచి విజయం సాధించి వారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు.
*రవికుమార్ చౌదరి మాట్లాడుతూ* ..1992 లో చిరంజీవి గారి ఘరానా మొగుడు చిత్రం గొప్ప సంచలనం సృష్టించింది. ఆ చిత్రం లాగే ఈ మూవీ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుతూ ఈ చిత్ర బృందానికి మంచి పేరు రావాలని అన్నారు.
*హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ* ..ఈ ప్రొడక్షన్ లో ఈ మూవీ చెస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది .నా మొదటి సినిమా రెడ్డి గారి ఇంట్లో రౌడీ ఇజం విడుదల కు సిద్ధంగా ఉంది. నా సెకండ్ మూవీ మా అమ్మగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ లో నేను నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
*నిర్మాత, హీరో, మోహన్ కృష్ణ మాట్లాడుతూ* ..ఇప్పటివరకు నేను బావ మరదలు, మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ సినిమాలు తీయడం జరిగింది .ఇది ప్రొడక్షన్ నెంబర్ త్రీ లో చిరంజీవిగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ తో చిత్రం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో వాణి విశ్వనాథ్ గారి కూతురు విశ్వనాథ్ గారు నటిస్తున్నారు. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో నేను సినిమా తీయడానికి ముందుకు వచ్చాను. మంచి సబ్జెక్టు తీసుకొని మంచి కంటెంట్ తో వస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.
*దర్శకుడు రాజుబాబు మాట్లాడుతూ* …నాకు చిరంజీవి గారు అంటే ఎనలేని అభిమానం చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ ఘరానా మొగుడు సినిమా వచ్చినప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ వ్రాస్తున్నాను. సినిమా చూసిన తర్వాత నాకు సినిమాపై మక్కువ ఏర్పడింది. ఆ తరువాత 1999 లో సినిమా ఇండస్ట్రీ కి వచ్చాను 2019 వరకు నేను పలు దర్శకుల దగ్గర పనిచేశాను. మొదటిసారి నేను మోహన్ కృష్ణ గారికి కథ చెప్పడంతో తను ఈ సినిమాను చేద్దామని చెప్పారు. ఇది నా మొదటి సినిమా. నేను చూసిన మొదటి సినిమా ఘరానా మొగుడు టైటిల్ కు నేను దర్శకత్వం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో దర్శకులపై పూరి గారు నేనింతే తీశాడు. ఒక సినీ దర్శకుడు సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత దర్శకుడు ఎలాంటి ఆశలతో భావాలతో వస్తాడు ఎలాంటి అంకితభావంతో పని చేస్తాడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని తను ఎలా దర్శకుడిగా నిర్వర్తిస్తాడు అదే సమయంలో అందమైన మంచి మనసు ఉన్న అమ్మాయి తన జీవితంలో ఎదురైన తరువాత ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే కథతో ఈ సినిమా తీయడం జరిగింది. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అన్నారు
*నటీనటులు*
మోహన్ కృష్ణ(హీరో), వర్ష విశ్వనాథ్ (హీరోయిన్), రావు రమేష్ రావు రమేష్ ,జీవి సుధాకర్ నాయుడు, భానుచందర్, ప్రసన్న కుమార్, సుధ, దేవి, కలర్స్ వాసు, గీతాసింగ్, జబర్దస్త్ అప్పారావు, పృథ్వి ,బోనం బాబి, సమీర్ శర్మ ,పింగ్ పాంగ్ సూర్య, రమేష్ ,బాలాజీ, కీర్తి ,జయశ్రీ తదితరులు
*సాంకేతిక నిపుణులు*
బ్యానర్ : యస్.యమ్. కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్
స్క్రీన్ ప్లే డైరెక్షన్. రాజుబాబు అచ్చరథ
డి.ఓ.పి : మురళి
మ్యూజిక్ :- ఘనశ్యాం
స్టోరీ డైలాగ్స్ :- శింగలూరి మోహన్ రావు
ఎడిటర్ :- కె ఎ వై పాపారావు
ఫైట్ మాస్టర్ :- రామ్ సుంకర
లిరిక్స్ :-శరత్ చంద్ర
స్టిల్స్ :-అంజి
డాన్స్ :-రాజ బోయిన, మహేష్
పబ్లిసిటీ డిజైనర్ :- విజయ్ కుమార్ బండి
ల్యాబ్ :- లైట్ లైన్ స్టూడియోస్
పి.ఆర్.ఓ:- సాయి సతీష్ , రాంబాబు పర్వత నేని