HomeTeluguఆహ్లాద‌ర‌కరంగా `గంధ‌ర్వ‌` లిరిక‌ల్ వీడియోసాంగ్ విడుద‌ల - జూలై 1న విడుద‌ల తేదీ ప్ర‌క‌ట‌న‌

ఆహ్లాద‌ర‌కరంగా `గంధ‌ర్వ‌` లిరిక‌ల్ వీడియోసాంగ్ విడుద‌ల – జూలై 1న విడుద‌ల తేదీ ప్ర‌క‌ట‌న‌

అటు న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది ఆహ్లాద‌క‌ర‌మైన మాట‌ల‌తో, ఇటు సినిమాపై గ‌ట్టి న‌మ్మ‌కంతో విడుద‌ల‌చేస్తున్న ఎస్‌.కె. ఫిలిమ్స్ అధినేత సురేష్‌కొండేటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌ల‌తో `గంధ‌ర్వ‌` చిత్రం లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల, సినిమా విడుద‌ల తేదీ ప్ర‌క‌ట‌న కార్య‌క్ర‌మం జ‌రిగాయి. ఆదివారంనాడు ప్ర‌సాద్‌ల్యాబ్ ప్రివ్యూ థియేట‌ర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర హీరో సందీప్ మాధ‌వ్‌, సాయికుమార్‌, బాబూమోహ‌న్, చిత్ర నిర్మాత స‌బాని, ద‌ర్శ‌కుడు అప్స‌ర్, సంగీత ద‌ర్శ‌కుడు ర్యాప్ రాక్ ష‌కీల్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

సందీప్ మాధ‌వ్‌, గాయ్ర‌తి ఆర్‌. సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `గంధ‌ర్వ‌`. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్ పై ఎస్‌.కె. ఫిలిమ్స్ స‌హ‌కారంతో యాక్ష‌న్ గ్రూప్ స‌మ‌ర్పిస్తున్న చిత్ర‌మిది. ఈ సంద‌ర్భంగా గంధ‌ర్వ చిత్ర పోస్ట‌ర్‌ను బాబూమోహ‌న్ ఆవిష్క‌రించ‌గా, జులై1న విడుద‌ల‌చేస్తున్న‌ట్లు ఛిత్ర హీరో సందీప్ మాధ‌వ్ ప్ర‌క‌టించారు. లిరికల్ సాంగ్ వీడియోను హీరో సాయికుమార్ విడుదల చేశారు.

అనంత‌రం బాబూ మోహ‌న్ మాట్లాడుతూ, మాకు కోడిరామ‌కృష్ణ గురువు. ఆ త‌ర్వాత మా సోద‌రుడు వీర‌శంక‌ర్‌. ఎందుక‌నో ఆయ‌న‌కు నామీద కోపం. నాకు ఏ సినిమా ఇవ్వ‌లేదు. అయితే ఈ సినిమా పూజ‌రోజు వీర‌శంక‌ర్ సినిమా చేస్తున్నాడ‌నిపించింది. కానీ ఆ త‌ర్వాత చెప్పారు కొత్త ద‌ర్శ‌కుడు అప్స‌ర్ చేస్తున్నాడ‌ని. చిత్ర క‌థ‌లోని పాయింట్ కొత్త‌ది. చెప్ప‌డం వేరు, తీయ‌డం వేరు. దాన్ని అప్స‌ర్ బాగా డీల్ చేశాడు. ఆయ‌న‌కు న‌చ్చిదంటే సూపర్‌డూప‌ర్ హిట్టే. ఈ సినిమాను అంద‌రూ చూడాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

సాయికుమార్ మాట్లాడుతూ, ఈ మ‌ధ్య దేశ‌భ‌క్తి చిత్రాలు సూప‌ర్ హిట్ అవుతున్నాయి. వాటిలో ఎమోష‌న్స్ బాగా పండుతుంది. మొన్న విడుద‌లైన మేజ‌ర్‌, విక్ర‌మ్ అందుకు ఉదాహ‌ర‌ణ‌లు. ఇక ద‌ర్శ‌కుడు వీర‌శంక‌ర్‌గారు గంధ‌ర్వ క‌థ‌ను నా ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌చ్చారు. సందీప్‌తో చేయ‌డం గాప్ప‌గా ఫీల‌వుతున్నాను. గంధ‌ర్వ టైటిల్‌లో చూపించిన‌ట్లుగా 1971-2021 క‌థ‌. అయితే నా సినీ కెరీర్‌కూడా 1972 నుంచి ఇంకా కొన‌సాగుతుంది. నా ఫిలిం కెరీర్ యాభై ఏళ్ళ జ‌ర్నీలో గంధ‌ర్వ విడుద‌ల కావ‌డం ఆనందంగా వుంది. ఇందులో ప్ర‌ధాన‌మైన పాత్ర పోషించాను. క‌థే చాలా కొత్త పాయింట్‌. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మా సినిమా వుండాలి. జూలై1న రాబోతుంది. డోన్ట్ మిస్‌.. అన్నారు.

హీరో సందీప్ మాధ‌వ్ మాట్లాడుతూ, ఇంత‌కుముందు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేశాను. గంధ‌ర్వ ఫిక్ష‌న్ పాయింట్‌. ఎందుకు, ఏమిటి? ఎలా జ‌రుగుతుంది? అనే ఆస‌క్తిక‌ర‌మై క‌థ‌తో నిర్మాత స‌బాని గారు కొత్త ద‌ర్శ‌కుడు అప్స‌ర్‌తో బ‌డ్జెట్‌కు వెనుకాడ‌కుండా నిర్మించారు. సాయికుమార్‌, బాబూమోహ‌న్ సినిమాలు చూసి చాలా నేర్చుకున్నాను. వీర‌శంక‌ర్‌గారు బాగా గైడెన్స్ ఇచ్చేవారు. ర్యాప్ రాక్ ష‌కీల్ సంగీతాన్ని బాగా స‌మ‌కూర్చాడు. సురేష్‌కొండేటిగారు ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ముందుకు రావ‌డంతో మా సినిమా స్థాయి పెరిగింది. ద‌ర్శ‌కుడు అప్స‌ర్ రాసుకున్న డైలాగ్స్‌, ఎమోష‌న్స్ బాగా పండాయి. ఈ చిత్రానికి ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రినీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాన‌ని అన్నారు.

జ‌ర్న‌లిస్టు, పంపిణీదారుడు, నిర్మాత, సంతోషం సినీవార‌ప్ర‌తిక ప‌బ్లిష‌ర్‌, ఎస్‌.కె. పిక్చ‌ర్స్ అధినేత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ, నేను చేసిన చిత్రాల‌న్నీ సూప‌ర్‌డూప‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నా. గంధ‌ర్వ ద‌ర్శ‌కుడు అప్స‌ర్ డెడికేష‌న్ బాగా న‌చ్చింది. మొద‌టినుంచీ ఆయ‌న్ను ప‌రిశీలిస్తున్నాను. ఓసారి అనుకోకుండా షూటింగ్ లొకేష‌న్‌కు వెళ్ళాను. అప్పుడు ఆయ‌న తీసే విధానం బాగా న‌చ్చి ఈ సినిమా నేను విడుద‌ల‌చేయాల‌ని ఫిక్స్ అయ్యాను. అది అప్పుడు వారికి చెప్ప‌లేదు. నేను సినిమా తొలికాపీ చూశాను. నా 31 ఏళ్ళ సినీ జ‌ర్న‌లిస్టు కెరీర్‌లో అంద‌రూ కొత్త‌పాయింట్‌, భిన్న‌మైన‌ద‌ని ఇంత‌వ‌ర‌కు రాని పాయింట్ అని చెబుతుండ‌డం విన్నాను. నా అబ్జ‌ర్‌వేష‌న్‌లో నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చాక ఇందులో వున్న కొత్త‌పాయింట్ ఏ ఒక్క సినిమా ఇప్ప‌టివ‌ర‌కు రాలేదు. ఆయ‌న‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఆయ‌న సినిమాను నేను విడుద‌ల చేయ‌డం ఆనందంగా వుంది. భ‌విష్య‌త్‌లో మ‌రో కొత్త పాయింట్‌తో వ‌స్తే నేను మీకు స‌పోర్ట్‌గా వుంటాను. మా బేన‌ర్ ద్వారా మ‌రో మంచి సినిమాకు అవ‌కాశం ఇచ్చిన నిర్మాత స‌బానిగారికీ, వారి కుటుంబానికి రుణ‌పండి వుంటాన‌ని తెలిపారు.

సంగీత ద‌ర్శ‌కుడు ర్యాప్ రాక్ ష‌కీల్ మాట్లాడుతూ, ఇది డ్రీమ్ నా ప్రాజెక్ట్‌. ఈ క‌థ విన్నాక నాకు అనిపించిన ఫీలింగ్. ద‌ర్శ‌కుడు అప్స‌ర్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. సురేష్‌కొండేటిగారు ప్రివ్యూ చూసిన‌ప్పుడు ఫ‌స్ట్ ఆఫ్ చూశాక ఇలా తీస్తార‌ని అనుకోలేదు అన్నారు. సెకండాఫ్ చూశాక ఇంకా ఎవ‌రికీ సినిమా చూపించొద్దు. ఇది నేను రిలీజ్ చేస్తాన‌ని అన్నారు. ఆయ‌న ముక్కుసూటి మ‌నిషి ఆయ‌న జ‌డ్జిమెంట్ క‌రెక్ట్‌గా వుంటుంది. ఆయ‌న రాక‌తో మా సినిమా స్థాయి పెరిగింది. కెమెరామెన్ జ‌వ‌హ‌ర్ రెడ్డి, నిర్మాత‌, ఎడిట‌ర్ ఇలా ప్ర‌తి ఒక్క‌రూ మంచి సినిమా తీశామ‌నే ఫీలింగ్‌తో వున్నాం. మా టీమ్ సంగీతం బాగా రావ‌డానికి స‌హ‌క‌రించారు. హీరో శాండీ, నాకో చ‌రిత్ర వుండాల‌నే సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంటాడు. జార్జిరెడ్డి త‌ర్వాత పెద్ద ఆఫ‌ర్లు తీసుకువ‌చ్చాను. అయినా ఆయ‌న టెంప్ట్ కాలేదు. ఆయ‌ను న‌చ్చితేనే సినిమా చేస్తాడు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుల టీమ్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. న‌టీన‌టులు బాగా స‌హ‌క‌రించార‌ని చెప్పారు.

నిర్మాత స‌బాని మాట్లాడుతూ, మా త‌మ్ముడు అప్స‌ర్ ఓ మూవీ వుంది. న‌న్ను న‌మ్మి పెట్టుబ‌డి పెట్ట‌మ‌న్నాడు. మూవీ పూర్త‌యింది. చూశాక చాలా బాగా తీశాడు అనిపించింది. పాండ‌మిక్‌ల‌ను ఎదుర్కొంటూ స‌మ్మ‌ర్‌ను తట్టుకుని చేసిన సినిమా ఇది. ఇలాంటి మంచి సినిమాలు మ‌రిన్ని మా సంస్థ ద్వారా రావాల‌నీ, త‌ద్వారా చాలామందికి ఉపాధి క‌ల్పించాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు.

చిత్ర ద‌ర్శ‌కుడు అప్స‌ర్ మాట్లాడుతూ, గంధ‌ర్వ స్టోరీ లంచ్ టైంలో సందీప్‌కు వినిపించాను. వెంట‌నే చేద్దామ‌న్నారు. అప్ప‌టినుంచి జూలై 1 విడుద‌ల‌వ‌ర‌కు జ‌ర్నీ సాగింది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగాయి. మొద‌టి ప్రివ్యూతోనే బిజినెస్ అయింది. ఇందుకు ష‌కీల్‌, సందీప్ కార‌ణం. మా గురువుగారు వీర‌శంక‌ర్ మంచి స‌ల‌హాలు ఇవ్వ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఒక్కొక్క‌టిగా అన్నీ అనుకూలించాయి. ప్ర‌భాస్ తొలి చిత్రానికి ప‌నిచేసిన జ‌వ‌హ‌ర్‌రెడ్డి మా సినిమాకు ప‌నిచేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అంద‌రూ స‌హ‌క‌రించారు. ర్యాప్ రాక్ ష‌కీల్ చిన్న సినిమాల‌కు ఎ.ఆర్‌. రెహ‌మాన్ లాంటి వాడు. సాయికుమార్ క‌థ చెప్ప‌గానే వెరైటీగా వుంద‌ని చేద్దామ‌న్నారు. దాంతో కొంచెం ధైర్యం వ‌చ్చింది. ఆ త‌ర్వాత బాబూమోహ‌న్‌గారు క‌థ చెప్ప‌గానే ఈ పాయింట్ ఇప్ప‌టివ‌ర‌కు రాలేద‌న్నారు. మొద‌టి సినిమాతోనే బాగా చేశావ‌నే ఆశీస్సులు పొందాను. అలాగే న‌టీన‌టులంతా బాగా స‌హ‌క‌రించారు. మా కుటుంబ‌స‌భ్యులు అండ‌గా నిలిచారు. ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్‌ను నేను తీశాను. ప్ర‌తివారూ చూడాల్సిన సినిమా అని చెప్పారు.

ఇంకా స‌మ్మెట గాంధీ, పాల్‌, సూర్య (పింగ్‌పాంగ్‌), కెమెరామెన్ జ‌వ‌హ‌ఱ్‌రెడ్డి, రూపాల‌క్ష్మి, జ‌య‌రాం, మ‌ధు త‌దిత‌రులు మాట్లాడారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES