HomeTeluguజీఏ2 పిక్చ‌ర్స్ లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న "వినరో భాగ్యము విష్ణు కథ"...

జీఏ2 పిక్చ‌ర్స్ లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న “వినరో భాగ్యము విష్ణు కథ” “దర్శన” లిరికల్ సాంగ్ విడుదల

 

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”.

తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కిరణ్ సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన “వాసవసుహాస” “బంగారం” పాటలకు, అలానే ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం “దర్శన” సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. భాస్కర భట్ల రవికుమార్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
“మనసే మనసే తననే కలిసే
అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా
తనతో నడిచే అడుగే మురిసే” అని స్టార్ట్ అయ్యే ఈ బ్రేకప్ సాంగ్ లోని “తట్టుకోవడం కాదే పిల్ల నావల్లా వయ్యారి,
గుక్కపట్టి ఏడుస్తుందే నా ప్రాణం నీవల్లా” లాంటి లిరిక్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇదివరకే కిరణ్ కి “ఎస్.ఆర్ కల్యాణమండపం” సినిమాకి మంచి సాంగ్స్ రాసిన భాస్కర భట్ల ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో పాటలను రచించారు.

మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

నటీనటులు
సినిమా పేరు : వినరో భాగ్యము విష్ణు కథ
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాస్
నటీనటులు – కిరణ్ అబ్బవరం, కాశ్మీర, మురళీ శర్మ
దర్శకుడు: మురళీ కిషోర్ అబ్బూరు
సంగీతం: చైతన్ భరద్వాజ్
DOP: డేనియల్ విశ్వాస్
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్
ఎడిటింగ్:మార్తాండ్ కె వెంకటేష్
బ్యానర్: జీఏ2 పిక్చ‌ర్స్
గాయకుడు: కారుణ్య
లిరిసిస్ట్: కళ్యాణ్ చక్రవర్తి
పి.ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES