సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా గతం ట్రైలర్ ను ఆవిష్కరించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

443


వెన్నులో వణుకు పుట్టించే సైకలాజికల్ థ్రిల్లర్ ‘గతం’ డైరెక్ట్ టు డిజిటల్ వరల్డ్ ప్రీమియర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ ప్రకటించింది. రచన, దర్శకత్వం కిరణ్. అమెరికాకు చెం దిన విద్యార్థులు, ఐటీవృత్తినిపుణులచే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ రూపొందించబడింది. మ్యాంగో మాస్ మీడియాతో కలసి ఆఫ్ బీట్ ఫిల్మ్స్, ఎస్ ఒరిజినల్స్ దీన్ని నిర్మించాయి. భార్గవ పొలుదాసు, రాకేశ్ గలిబె, పూజిత కూరపర్తిప్రధాన పాత్రల్లో నటించారు. లేక్ టాహో నేపథ్యంలో రూపుదిద్దుకున్న గతం సినిమా అంతా కూడా కోమా నుంచి కోలుకున్నా, తన గతం మర్చిపోయిన ఓ వ్యక్తి చుట్టురా తిరుగుతుంది. తాను ఎవరోతెలుసుకునేందుకు ఆ వ్యక్తి చేసిన పోరాటం ఆయన జీవితంలో ఊహించని భయంకర సాహసాలకు దారి తీస్తుంది. భారత్ మరియు 200 దే శాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు గతం ప్రీమియర్ నుపండుగ చిత్రాల విడుదల సందర్భంగా నవంబర్ 6న ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై చూడవచ్చు

ఈ సందర్భంగా ఆసక్తిదాయకమైన ఈ వెంచర్ గురించి డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ, ‘‘దర్శకత్వం అంటే నాకెంతో ఇష్టం. ప్రయోగాలు చేయడం, వివిధ ఫార్మాట్స్ లో రూపొందించడంపై ఆసక్తి కనబరుస్తాను. గతం సినిమాతో కథ చెప్పే భారతీయ శైలిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, ఏదో ఒక కొత్తదనాన్ని వీక్షకులకు అందించాలని నేను కోరుకుంటున్నాను. గతం కథాంశం అంతా కూడా ఒకఆసక్తిదాయకమైన ప్రశ్న చుట్టూరా ఉంటుంది. జీవితం పున:ప్రారంభం అయితే ఏం పరిస్థితి అనేదే ఆ ప్రశ్న. ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షకులకు అందుబాటులోకిరావడం నాకెంతో ఆనందదాయకం’’ అని అన్న