“మోహనకృష్ణ గ్యాంగ్ లీడర్” న్యూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!!

576

యంగ్ హీరో మోహనకృష్ణ హీరోగా సౌజన్య, హరినీరెడ్డి, మమత, సోనియా సోలంకి హీరోయిన్స్ గా శ్రీ లక్ష్మణ్ దర్శకత్వంలో మాణిక్యం మూవీస్ బ్యానర్లో ఎస్.ఎం.కె ఫిలిమ్స్ సమర్పణలో ప్రొడక్షన్ నంబర్-2గా సింగులూరి మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం “మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్”. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ తరుణంలో నూతన సంవత్సరం సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. జనవరి 1న చిత్ర యూనిట్ న్యూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని స్టార్ డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

చిత్ర దర్శకుడు శ్రీ లక్ష్మణ్ మాట్లాడుతూ… 2021నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ‘మోహనకృష్ణ గ్యాంగ్ లీడర్’ న్యూ లుక్ తో వుండే ఫస్ట్ లుక్ పోస్టర్ బాబీ గారు రిలీజ్ చేశారు. ఆయనకి మా టీం తరుపున ధన్యవాదాలు.. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హీరో మోహనకృష్ణ సూపర్బ్ గా యాక్ట్ చేసాడు. మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత మోహన్ రావు గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు.. గన్ శ్యామ్ మ్యూజిక్, శివ మురళి కెమెరా విజువల్స్ మా చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ కానున్నాయి. తప్పకుండా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని టీమ్ అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.. అన్నారు.

హీరో మోహనకృష్ణ మాట్లాడుతూ.. మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన బాబీ గారికి థాంక్స్. నూతన సంవత్సరం 2021 సందర్బంగా శుభాకాంక్షలు. న్యూ కాన్సెప్టుతో శ్రీ లక్ష్మణ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. హీరోగా ఈ సినిమా నాకు మంచి బ్రేక్ నిస్తుందని నమ్మకం ఉంది. సుమన్, సుధ, శ్రీనివాస్ రెడ్డి, వంటి సీనియర్ యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు నా కృతజ్ఞతలు.. అన్నారు.

నిర్మాత సింగులూరి మోహన్ రావు మాట్లాడుతూ.. మా బ్యానర్లో ఇది రెండవ చిత్రం. జనవరి 1న కొత్త సంవత్సరం నాడు మా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా అంతా సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేశాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా కోపరేట్ చేశారు. శ్రీ లక్ష్మణ్ కథ ఎంత బాగా చెప్పాడో అంతకంటే గొప్పగా సినిమాని తెరకెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న ఈ మూవీని ఉగాది సందర్బంగా మార్చిలో విడుదల చేయాలని నిర్ణయించాం.. మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న మరికొన్ని సినిమాలు కూడా సక్సెస్ అయి నిర్మాతలకు డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.

సుమన్, సుధ, ప్రసన్నకుమార్, గురుస్వామి, సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహేష్, జగదీశ్వరి, జబర్దస్త్ బాబీ, వరహాల బాబు, శివ, లడ్డు, రంజిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ గణ శ్యామ్, కెమెరా; శివ, మురళి, ఎడిటర్; కాయ్ పాపారావు, ఫైట్స్; రామ్ సుంకర, కొరియోగ్రాఫర్; మహేష్ రాజా బోయిన, పి.ఆర్. ఓ. సాయి సతీష్, కో-ప్రొడ్యూసర్స్; ఎన్.వి.వి. సుబ్బారెడ్డి, వయ్యాల శ్రీనివాసరావు, నిర్మాత; సింగులూరి మోహన్ రావు, దర్శకత్వం; శ్రీ లక్ష్మణ్.