సినిమా అంటేనే కోట్ల బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది జీరో బడ్జెట్ తో సినిమా సాధ్యమా? అంటే సాధ్యమే అంటూ వారణాశి సూర్య ఓ వినూత్న ప్రయోగానికి తెరతీస్తూ ఈజీ మూవీస్ బేనర్ పై `గండ` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రారంభించిన పవన్ కళ్యాన్ స్ఫూర్తితో జీరో బడ్జెట్ మూవీని తెరకెక్కించా అంటున్నారు దర్శకుడు వారణాశి సూర్య. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత శివశక్తి దత్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత శివశక్తి దత్త మాట్లాడుతూ…“ వారణాశి సూర్య చేస్తోన్నజీరో బడ్జెట్ చిత్రం గురించి విని మొదట ఆశ్చర్యపోయాను…ఆ తర్వాత ఆనందించాను. ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్పూర్తిగా ఆశీర్వదించాను. డబ్బు లేకున్నా చేయాలన్న ఉత్సాహం, తపన ఉంటే చాలని ఈజీ సినిమా వారు ఈ సినిమాతో నిరూపిస్తున్నారు. ఈ ప్రయోగం ఎంతో మంది ఔత్సాహికులకు ఆదర్శంగా నిలవాలనీ, ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా మారాలని కోరుకుంటున్నా. గండ అంటే మగవాడు అని అర్థం. ఈ సినిమా గండరగండడుగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారణాశి సూర్యకు నా అభినందనలు“ అన్నారు.
దర్శకుడు వారణాశి సూర్య మాట్లాడుతూ…“నేను కూడా మీడియా వ్యక్తినే. సినిమా మీద ప్యాషన్ తో ఈ రంగంలోకి వచ్చాను. తెలుగు సినిమా చరిత్రలో మొదటి జీరో బడ్జెట్ మూవీ గండ. మా టీమ్ అంతా కొత్తవారే. కంటెంట్ నమ్ముకుని సినిమా తీశాం. నాకు తెలిసింది సినిమా ఒక్కటే. అన్నీ వదిలేసి ఈ సినిమా చేశాను. ఈ జీరో బడ్జెట్ సినిమాకు కర్త,కర్మ, క్రియ అన్నీ నేనే. మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తోన్న మా టీమ్ మెంబర్స్ కీ ధన్యవాదాలు. ఇక నుంచి మా సంస్థ నుండి వరుస జీరో బడ్జెట్ చిత్రాలు వస్తాయి. మా జీరో బడ్జెట్ సినిమాకి అన్ని విధాలుగా సహకరిస్తోన్న ప్రముఖ రచయిత శివశక్తి దత్త గారు ఇక్కడికి వచ్చి మా టీమ్‌ని, మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో యుద్ధం కొనసాగిస్తున్నప్పుడు…సినిమా ఇండస్ట్రీలో జీరో బడ్జెట్ మూవీస్ఎందుకు చేయకూడదన్న ఆలోచనతో ఈ సినిమా ప్రారంభించాం. ఆర్జీవీ గారు జీరో బడ్జెట్ మూవీస్ చేయొచ్చని పన్నేండేళ్ల క్రితమే చెప్పారు. అది కూడా ఈ సినిమాకు ఓ ఇనిస్పిరేషనే. ఈ సినిమా పై మా టీమ్ అంతా ఐదేళ్లు వర్క్ చేసాము. ఒక కొత్త ప్రయత్నం ఎప్పుడూ మొదట ఎన్నో విమర్శలకు. అవమానాలకు గురవుతుంది..అలాంటి ఎన్నో అవమానాలు, విమర్శలు తట్టుకుంటూ ఈ సినిమా పూర్తి చేశాను. ప్రస్తుతం టీజర్ రిలీజ్ చేస్తున్నాం. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈజీ సినిమా సంస్థ కొన్ని వేల మంది ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ కు అవకాశాలు క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇకపై ఇండస్ట్రీలో జీరో బడ్జెట్ సినిమాలు చూస్తారు. కంటెంట్ ని నమ్ముకుని ఈ సినిమా చేశాను. మేము చేస్తున్న ఈ ప్రయోగానికి మీడియా సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా“ అన్నారు.