గమనం సినిమాతో సుజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను పెంచారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శర్వానంద్, దేవా కట్టా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 10న ఓ మంచి సినిమాను చూడబోతోన్నాం. దర్శకురాలు సుజనగారి కృషి, దీక్ష, పట్టుదల నాకు తెలుసు. ఆమె ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీ ఇచ్చే విషయంలో గానీ, క్వాలిటీ ఇచ్చే మనుషుల విషయంలో గానీ కాంప్రమైజ్ కాలేదు. మ్యూజిక్ కోసం ఇళయరాజా గారిని తీసుకుంది. ఈ సినిమాకు మ్యూజిక్ ఎంత ముఖ్యమో ఆమెకు తెలుసు. ముఖ్యమైన పాత్రకు శ్రియను ఎంచుకుంది. ఏకంగా ఆర్ఆర్ఆర్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారిని పెట్టుకుంది. ఇంత మందిని ఒకే చోటకు తీసుకొచ్చింది. ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ఒక అమ్మాయి కష్టపడి ఇంత చేసిందంటే ఇది చాలా గొప్ప విషయం’ అని అన్నారు.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ‘తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం కాబోతోన్న సుజనా రావును ఆశీర్వదించేందుకు వచ్చాం. ఆ అమ్మాయిని నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. గొట్టెముక్కల పద్మారావు మాకు స్నేహితుడు. ఆయన కూతురే ఈ దర్శకురాలు. ఓ మంచి కథను సిద్దం చేసుకుంది. ఈ కథను పరిపూర్ణంగా మాటల రూపంలో తీసుకురావాలంటే సాయి మాధవ్ బుర్రా కావాల్సిందే. క్రిష్, జ్ఞానశేఖర్, సాయి మాధవ్ బుర్రా కాంబినేషన్‌లో ఎన్నో క్వాలిటీ చిత్రాలు వచ్చాయి. ఇలాంటి కాంబినేషన్ ఈ సినిమాకు దొరకడం ఆమె అదృష్టం. ఇళయరాజా గారికి తన కథ చెప్పి, ఒప్పించి సంగీతమందించేలా చేసింది. పాటలు ఎంత అద్బుతంగా ఉన్నాయో సినిమా కూడా అంతే అద్బుతంగా ఉంటుంది. ఈ చిత్రం కచ్చితంగా విజయవంతమవుతుంది’ అని అన్నారు.
సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ‘కొత్త దర్శకురాలైనా కూడా సుజన ఎంతో సృజన్మాతకమైన సినిమాను తీశారు. మొదటి సినిమాగా ఏదో నాలుగు పాటలు అని తీయలేదు. ఎంతో విలువలున్న సినిమాను తీశార. కథ చెప్పినప్పుడే మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాను. చెప్పాల్సిన కథ, చూడాల్సిన కథ. మంచి సినిమా వస్తే తెలుగు వాళ్లు ఎప్పుడు ఆధరిస్తారు. విలువలున్న కథతో సుజన ముందుకు వచ్చారు. ప్రతీ ఒక్కరి పాత్రలో జీవం ఉంటుంది. శ్రియా గారి నటన నెక్స్ట్ లెవెల్. నాకు ఎంతో నచ్చిన నిత్యా మీనన్ నటించారు. ఇళయరాజా గారితో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
రైటర్ కన్నన్ మాట్లాడుతూ.. ‘ఇది బెస్ట్ సినిమా అవుతుంది. అద్బుతమైన స్క్రీన్ ప్లే. శ్రియాను ఇది వరకు ఇలా ఎప్పుడూ చూసి ఉండదు. అలాంటి క్లైమాక్స్‌ను ఎప్పుడూ చూసి ఉండరు. ఒక్కో కథకు ఒక్కో ఎమోషన్ ఉంటుంది. దాన్ని ఎలా ఇంటర్ లింక్ చేశారో సినిమా చూస్తే తెలుస్తోంది. ఇళయరాజా గారి వల్లే సినిమాకు ప్రాణం వచ్చింది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరి తల్లిదండ్రులు గర్వపడే సినిమా అవుతుంది’ అని అన్నారు.
కృష్ణకాంత్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి ఇళయరాజాగారికి పాటలు వింటూ పెరిగాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. ఇంత మంచి సందర్భాలు ఇచ్చిన పాటలు రాయించినందుకు దర్శకురాలు సుజనకు థ్యాంక్స్’ అని అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘రెండు నెలల క్రితమే ఈ సినిమాను చూపించారు. టెక్నికల్‌గా ఎంతో బ్రిల్లియంట్‌గా ఉంది. ఫైట్స్, డ్యూయెట్స్, కమర్షియల్ మాస్ మసాలా ఉండవు. కానీ ఇది మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ‘నీకు వినబడకపోయినా.. నీకు గంటకొట్టి పూజ చేస్తాను.. నీకు కూడా వినబడదని నాకేం తెలుసు’, ‘ఆ దేవుడు తాను చేసిన బొమ్మల్ని ముంచేస్తుంటే.. వినాయకుడి బొమ్మ మునిగిపోతోందని ఎందుకు బాధపడతారు’ అనే ఈ డైలాగ్స్ సినిమా సారం ఏంటో చెబుతుంది. ప్రతీ ఒక్కరూ ఇలాంటి ఓ సినిమా చేయాలని అనుకుంటారు. సుజనా తన ప్రయాణానికి సరైన సినిమాను ఎంచుకుంది. ప్రతీ ఒక్కరూ ఎంతో గొప్పగా పని చేశారు. ఇలాంటి ఓ కథ ఓ నటుడికి జీవితంలో ఒకే ఒక్కసారి వస్తుంది.. నేను చేస్తాను అని శివ చెప్పాడు. అలా ఈ చిత్రం మొదలైంది’ అని అన్నారు.
నిర్మాత రమేష్ మాట్లాడుతూ.. ‘జర్మనీలో ఐటీ జాబ్ చేస్తూ ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూషన్ చేస్తుండేవాడిని. సినిమాల మీద నాకున్న ఇంట్రెస్ట్‌లో ఇలా నిర్మాణంలోకి వచ్చాను. ఈ కథ విన్నాక హృదయం బరువెక్కింది. ఇలాంటి కథ చేయగలమా? లేదా? అని అనుకున్నాను. కానీ కథ నన్ను వెంటాడుతూ వచ్చింది. సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. క్రిష్ గారు, రాజీవ్ గారు, కన్నన్ గారు వీరంతా మా ఫస్ట్ క్రిటిక్స్. వాళ్లు సినిమా చూసి చెప్పిన మాటలు ఇంకా ధైర్యాన్ని ఇచ్చాయి. రాజ్ కందుకూరిని మొదటిసారిగా కలిసినా కూడా ఆ ఫీలింగ్ రాలేదు. ఎప్పటి నుంచో పరిచయమున్న వ్యక్తిలా అనిపించారు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. లిరిసిస్ట్ కృష్ణకాంత్ నాకు మొదటి నుంచి స్నేహితుడు. జ్ఞానశేఖర్ ముందు నుంచి మాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు’ అని అన్నారు.
జ్ఞానశేఖర్ మాట్లాడుతూ.. ‘చిన్న సినిమా అని పెద్ద సినిమా అని నేను తేడా చూడను. ఓ మంచి ప్రాజెక్ట్ వస్తే అది నేను ఎందుకు చేయలేకపోయాను అని అనుకుంటాను. అలా సుజన ఈ కథను నాకు చెప్పినప్పుడు.. మళ్లీ వేరే వాళ్లతో తీయడం ఎందుకు అటూ ఇటూ తిరగడం ఎందుకు అని కథ మీద ఇంట్రస్ట్‌తో నేను నిర్మించేందుకు ముందుకు వచ్చాను. అంతే కానీ ప్రొడక్షన్ కంపెనీ పెట్టాలని సినిమాను నిర్మించలేదు’ అని అన్నారు.
గొట్టెముక్కల పద్మారావు మాట్లాడుతూ.. ‘సినిమాను తీయాలని అనుకోవడం వేరు.. చేయాలని అనుకోవడం వేరు. నేను కూడా మంచి సినిమాలను తీశాను. నా కూతురు ఎవ్వరి దగ్గరగా పని చేయలేదు. డైరెక్టర్ అనే కుర్చీని చూసి దర్శకురాలైంది. నా కూతురు చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ తీసింది. వాటిని చూసి నిర్మాతలు ముందుకు వచ్చారు. ఈ చిత్రం మంచి విజయ
దర్శకురాలు సుజనా రావు మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. సినిమా తీయాలని అనుకున్నప్పుడు ఓ అందమైన కథ రాసుకున్నాను. కానీ అది ఈ కథ కాదు. ఆ కథ స్టార్ట్ అవుతుందని అనుకున్నప్పుడు బ్రేక్ పడింది. దాని వల్ల చాలా బాధపడ్డాను. ఆ తరువాత నేను గమనం రాయడం ప్రారంభించాను. చిన్న కథలా రాశాను. బాబా సర్‌కు పంపించాను. ఇది చాలా బాగుంది.. నేను నిర్మిస్తాను అని మెసెజ్ పెట్టారు. కన్నన్ గారికి, సాయి మాధవ్ గారికి స్క్రిప్ట్ వినిపించాను. శ్రియాకు కలిసి స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఓకే అన్నారు. ఇళయరాజా గారిని కలిస్తే చాలని అనుకున్నాను. కానీ ఆయన కథ విన్నాక వెంటనే ఓకే చెప్పేశారు. అలా కలిసిన ప్రతీ ఒక్కరూ సినిమా బాగుందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. నా మొదటి సినిమా ఆగింది. కానీ ఈ చిత్రం మొదలవ్వడంతో జీవితంలో ఏది జరిగినా మన మంచికే అని అర్థమైంది. కమల పాత్రను అంగీకరించి చేసినందుకు శ్రియాకు థ్యాంక్స్. ఇలాంటి పాత్రలో శ్రియాను చూసి ఉండరు. ప్రియాంక, శివ అద్బుతంగా నటించారు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలకు థ్యాంక్స్’ అని అన్నారు.
ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు గెస్టులుగా వచ్చిన శర్వా సర్, దేవా కట్టా సర్‌కు థ్యాంక్స్. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. ఇలాంటి గొప్ప సినిమాను తీశామని మాకు గర్వంగా ఉంది. డిసెంబర్ 10న సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్క నటుడికి సినిమా రిలీజ్ అంటే ఓ నర్వస్ ఫీలింగ్ ఉంటుంది. నాక్కూడా అలానే ఉంది. కానీ ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. నన్ను నమ్మి ఆలీ అనే పాత్ర ఇచ్చినందుకు సుజనకు థ్యాంక్స్. సుజన నేను క్లాస్ మేట్స్. బాబా సర్ కెమెరావర్క్ పని తనం వల్ల సినిమా మీద నాకు మరింత గౌరవం పెరిగింది. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. ప్రియాంక నాకు ముందు నుంచి స్నేహితురాలు. శ్రియ ఈ సినిమాకు బలంగా మారారు. కథ విన్నప్పుడు నాకు ఇంకేం గుర్తుకు రాలేదు. ఇందులో నటిస్తే చాలని అనుకున్నాను. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి సినిమా రావడం నాకు ఆనందంగా ఉంది. ఇళయరాజా గారి సినిమాలో నేను నటించడం సంతోషంగా ఉంది. బాలయ్య గారి అఖండ సినిమాను జనాలు ఎంతగానో ప్రేమిస్తున్నారు. డిసెంబర్ 10న రాబోయే మా సినిమాలను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
శ్రియ మాట్లాడుతూ.. ‘ప్రతీ ఫ్రేమ్ కూడా ఒక అందమైన పెయింటింగ్‌లా మారింది. బాబా గారి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. కమల పాత్రను ఇచ్చినందుకు సుజనకు థ్యాంక్స్. ఈ సినిమా వెనక ఎంతో మంది కష్టం ఉంది. మీ ప్రేమ నాపై ఎప్పుడూ ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
దేవా కట్టా మాట్లాడుతూ.. ‘ప్రస్థానం కలిపిన గమనం అయింది. ఈ సినిమా ఐడియాస్ స్టేజ్ నుంచే నాకు తెలుసు. జ్ఞాన, నేను కలిసి చర్చించుకునేవాళ్లం. ఆప్పుడు కళ్లలో ఎంత ఆనందం కనిపించిందో ఇప్పటికీ అలానే ఉంది. ఇందులోని ప్రతీ ఫ్రేమ్‌లో జీవం కనిపిస్తుంది. శ్రియను జ్ఞాన ఎంతో కన్విన్స్ చేశాడు. మంచి ఐడియా చుట్టూ.. మంచి మనుషులు చేరతారు. ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుంది. గమనం అనేది ఓ మెమరబుల్ సినిమా అవుతుంది. ప్రియాంక, శివ ఎంతో అద్బుతంగా నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
శర్వానంద్ మాట్లాడుతూ.. ‘బాబా గారి వల్లే నేను ఇక్కడకు వచ్చాను. మా ప్రయాణం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాతో మొదలైంది. నిర్మాతగ మారతానని చెప్పినప్పుడు అవసరమా? అని అనిపించింది. కానీ కథ విన్నాక ఇదెంతో గొప్పదని తెలిసింది. గమ్యం, ప్రస్థానం, జర్నీ, గమనం అన్నీ కూడా ట్రావెల్ మీదే ఉన్నాయి. ఇళయరాజా గారితో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. శివ ఓ ప్రామిసింగ్ యాక్టర్. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. ప్రియాంక మంచి నటి. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. డిసెంబర్ 10న గమనం రాబోతోంది. అందరూ సినిమాను చూడండి. శ్రియా, నేను ఎంతో కాలం నుంచి ఫ్రెండ్స్. సంతోషం సినిమా నుంచి ఇప్పటికీ ఇలానే ఉంది. మంచి పాత్రలను ఎంచుకంటూ ముందుకు వెళ్తుంది’ అని అన్నారు
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385