బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `గాలి సంపత్`. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తుండడం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి అనీష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకి, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ మూవీలోని పాప ఓ పాప సాంగ్‌ని క్రేజీ హీరో విజయ్ దేవరకొండ విడుదలచేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
`పాప ఓ పాప నీ పేరు తలిచినే మజ్నునయ్యానే..పాప ఓ పాప నా పేరే మరిచినే పిచ్చోన్నయ్యానే.. హే పాపా.. అరే నా కోసమే నువుపుట్టావే..హే పాపా నా నిద్దరనే చెడగొట్టావే పాప నా ఎదపై నీ కాటుక కన్నుల కుంచలతో ఐలవ్‌యూ రాసినావే..“ అంటూ హుశారుగా సాగే ఈ పాటకి స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా బెన్ని దయాల్, బెన్ హ్యూమన్, అనుదీప్ దేవ్ ఫుల్ ఎనర్జీతో ఆలపించారు. అచ్చురాజమణి బాణీలు సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాయి.
మొత్తంగా ఈ ట్రైలర్, పాటలు చూస్తుంటే వరుసగా ఐదు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి పర్యవేక్షణలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా `గాలి సంపత్` రూపొందుతోంది అని తెలుస్తోంది. మార్చి7న `గాలి సంపత్ గ్రాండ్ ప్రీ రిలీజ్` ఈవెంట్‌ని జరిపి మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి,
కథ: ఎస్. క్రిష్ణ,
రచనా సహకారం: ఆదినారాయణ,
సినిమాటోగ్రఫి: సాయి శ్రీ రామ్,
సంగీతం: అచ్చురాజమణి,
ఆర్ట్: ఎ ఎస్ ప్రకాశ్,
ఎడిటర్: తమ్మిరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగమోహన్ బాబు. ఎమ్,
మాటలు: మిర్చికిరణ్,
లిరిక్స్: రామజోగయ్య శాస్ర్తి,
ఫైట్స్: నభ,
కొరియోగ్రఫి: శేఖర్, భాను,
మేకప్: రంజిత్,
క్యాస్ట్యూమ్స్: వాసు,
చీఫ్ కో డైరెక్టర్: సత్యం బెల్లంకొండ.
నిర్మాణం: ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్, షైన్ స్క్రీన్స్,
నిర్మాత: ఎస్. క్రిష్ణ,
స్క్రీన్ ప్లే, సమర్పణ, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి,
దర్శకత్వం: అనీష్.