నల్లమల కోసం మొదటిసారి ఫోక్ సాంగ్ పాడిన సిధ్ శ్రీరామ్

415

సినిమా సంగీతంలో ఒక్కోసారి ఒక్కో హవా నడుస్తుంది. ప్రస్తుతం గాయకుడు సిధ్ శ్రీరామ్ హవా నడుస్తోంది. అతను పాడితే సినిమా హిట్ అనే రేంజ్ లో సెంటిమెంట్ బలపడింది. అయితే ఇప్పటి వరకూ శ్రీరామ్ పాడినవన్నీ మెలోడీయస్ గీతాలే. భారతీయ సంగీతంతో పాటు పాప్ మ్యూజిక్ లోనూ ప్రవేశం ఉన్న సిధ్ శ్రీరామ్ ఫస్ట్ టైమ్ ఓ ఫోక్ సాంగ్ పాడాడు.సిధ్ శ్రీరామ్ ఇప్పటి వరకూ పాడిన పాటలకు ఎంతోమంది
అభిమానులున్నారు. అలాంటి వారందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘నల్లమల’చిత్రంలో ‘‘ఏమున్నావే పిల్లా ఏమున్నావే.. అందంతో బంధించావే’’ అంటూ సాగే అందమైన జానపదాన్ని అంతే అందంగా ఆలపించి ఆశ్చర్యపరిచాడు. ‘పి.ఆర్’సంగీతం అందిస్తూ తనే రాసిన పాట ఇది. సంగీతంతో పాటు సాహిత్యం కూడా అచ్చమైన జానపదాన్ని తలపించేలా ఉంది. ఇక మెలోడీ సాంగ్స్ లో సిధ్ శ్రీరామ్ స్వరం ఎంత గొప్పగా అనిపించిందో ఈ జానపద గీతంలోనూ అంతే గొప్పగా ఉంది. మనకు ఫోక్ సాంగ్ అనగానే కొన్ని ప్రత్యేకమైన స్వరాలు గుర్తొస్తాయి. అలాంటి వారికి మించిన స్థాయిలో తనదైన శైలి గానంతో అలరించాడు సిధ్ శ్రీరామ్.

నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనల చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కుతోన్న చిత్రం నల్లమల. ఇప్పటి వరకూ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చినా వాటికి భిన్నమైన కథ, కథనాలతో వస్తోందీ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

థే ప్రధాన బలంగా వస్తోన్న నల్లమల చిత్రం లో అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతికంగానూ హై స్టాండర్డ్స్ లో నిలిచే ఈ మూవీకి
ఎడిటర్ : శివ సర్వాణి
ఫైట్స్ : నబా
విఎఫ్ఎక్స్ : విజయ్ రాజ్
ఆర్ట్ : యాదగిరి
పి.ఆర్.వో : దుద్ది శ్రీను
సినిమాటోగ్రఫీ : వేణు మురళి
సంగీతం, పాటలు : పి.ఆర్
నిర్మాత : ఆర్.ఎమ్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవి చరణ్  

PRO’DUDDI SEENU