*”యురేక” అందరినీ థ్రిల్ చేస్తుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కమ్ డైరెక్టర్ కార్తిక్ ఆనంద్*

561


కార్తీక్ ఆనంద్, సయ్యద్ సోహైల్ రియాన్, డింపుల్ హయతి, షాలిని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యురేక’. లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై కార్తీక్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈనెల 13న విడుదలకానున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరబాద్లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మధుర శ్రీధర్, బెక్కెం వేణు గోపాల్, రాజ్ కందుకూరి, దామోదర్ ప్రసాద్, రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, 90 ML డైరెక్టర్ శేఖర్, అలీ రేజా మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మధురా శ్రీధర్ మాట్లాడుతూ
యురేక సినిమా ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే డైరెక్టర్ కార్తిక్ ఆనంద్ కష్టం కనపడుతుంది. కార్తీక్ నీ సపోర్ట్ చేసిన వారి అమ్మగారి కోసమైనా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుతున్నా. ఈ సినిమాలో పనిచేసిన అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

నిర్మాత ప్రశాంత్ తాత మాట్లాడుతూ
ఒక మంచి సినిమా తీశామని నమ్ముతున్నాము, మాకు సహకరిస్తోన్న నిర్మాతలు రాజ్ కందుకూరి, మధురా శ్రీధర్, బెక్కెం వేణుగోపాల్ గారికి ప్రేత్యేక ధన్యవాదాలు. నటిస్తూ మరోవైపు దర్శకత్వం వహిస్తూ సినిమాను బాగా తీసాడు కార్తిక్ ఆనంద్, తనకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని, ఈ సినిమా సక్సెస్ అయ్యి ఈ చిత్రంలో నటించిన అందరికి మంచి గుర్తింపు రావాలి, సినిమాలో నటించిన ప్రతి పాత్రకూ న్యాయం చేశారు. మంచి టెక్నీషియన్స్ తో సినిమా తీశాం. ట్రైలర్ తో యూత్ కి మరిత దగ్గర చేసిన ఎడిటర్ అనిల్ కి థాంక్స్. మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ
యురేక థ్రిల్లర్ మూవీలా ఉంది. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలైనా ఆదరిస్తారు. మత్తు వదలరా లాంటి సినిమాలు సక్సెస్ అయ్యాయి. అదే తరహాలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా, ట్రైలర్ బాగుంది, మార్చి 13న విడుదలయ్యే ఈ సినిమా టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను. దర్శకుడు కార్తిక్ ఆనంద్ భవిసత్తులో ఇలాంటి మరెన్నో మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ
చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. ఏ సినిమా హిట్ అయితే అదే పెద్ద సినిమా, చిన్న పెద్ద సినిమాలకు తేడా ఉండదు. ఏది బాగుంటే అదే మంచి సినిమా. యురేక సినిమా పెద్ద రేంజ్ కు వెళుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో పనిచేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలువుతున్నాను అన్నారు.

బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ
యురేక సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. ఉదోగ్యం చేస్తూ, దర్శకత్వం తో పాటు తను కూడా నటించిన కార్తీక్ కి అభినందలు. సినిమా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. మరింత మంది కొత్తవారు ఇండస్ట్రీ కి రావాలి. యురేక సక్సెస్ అయితే ఇలాంటి మరెన్నో సినిమాలు వస్తాయి, ఇలాంటి మూవీస్ కు అందరూ సపోర్ట్ చెయ్యాలని తెలిపారు.

డైరెక్టర్ కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ
మమ్మల్ని విష్ చేయడినికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. చాలా టైట్ షెడ్యూల్ లో మాకు సహకరించిన కెమెరా మెన్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ కి థాంక్స్. యురేక సినిమాను చిన్న సినిమాగా ఎప్పుడు ఊహుంచుకొలేదు. నేను అనుకున్న దానికంటే బెటర్ గా సినిమా తీసాను. నన్ను సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ , ప్రశాంత్ పేరెంట్స్ కు స్పెషల్ థాంక్స్. మార్చి 13న విడుదల కానున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. కాలేజ్ నేపథ్యంలో వస్తోన్న మా యురేక సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందరిని అలరిస్తాయని భావిస్తున్నాను అన్నారు.

నటీనటులు:
కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి,సయ్యద్ సోహైల్ రియాన్,షాలిని, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్, రాకెట్ రాఘవ, మహేష్
విట్టా, మస్త్ అలీ ఆర్.కె,వేణుగోపాల్ రావు, కొటేష్ తదితరులు.
సాంకేతికవర్గం:
దర్శకత్వం: కార్తీక్ ఆనంద్
నిర్మాత: ప్రశాంత్ తాత
సహా నిర్మాత: లలిత కుమారి బొడ్డుచర్ల
సంగీతం: నరేష్ కుమరన్
డివోపి: ఎన్.బి. విశ్వకాంత్
ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి
ఆర్ట్: అవినాష్ కొల్ల
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి
సాహిత్యం: రామాంజనేయులు
పీఆర్ వో: జి.ఎస్.కె మీడియా