ఎర్రగుడి మూవీ తొలి షెడ్యూల్ పూర్తి.

252


అన్విక ఆడ్స్ ఫర్ ఎర్రగుడి సినిమా డిసెంబర్ 19న ప్రారంభమై ఏకధాటిగా డిసెంబర్ 31 వరకు జరిగిన షూటింగ్తో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. *షూటింగ్ వివరాలు దర్శకుడు సంజీవ్ మేగోటి తెలియజేస్తూ.. మొదటి షెడ్యూలు అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. హీరో వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్ పై సూర్యకిరణ్ కొరియోగ్రఫీలో నైట్ ఎఫెక్ట్ లో ఒక రెయిన్ సాంగ్ చిత్రీకరించాం. అలాగే హీరో హీరోయిన్లు మరియు సత్య ప్రకాష్ తదితరులపై నటరాజ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నైట్ ఎఫెక్ట్ లోనే ఒక భారీ ఫైట్ చిత్రీకరించాం. అన్నపూర్ణ స్టూడియోలో హీరో హీరోయిన్లు, సమ్మెట గాంధీ,ఢిల్లీ రాజేశ్వరి, ఆర్కే జ్యోతి, శ్రావణి, శ్రీ కళ తదితరుల కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. జనవరి చివరి వారంలో తాజా షెడ్యూలు ప్రారంభిస్తాం “అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ ఆర్డీఎస్ మాట్లాడుతూ…”1975లో కథ ప్రారంభమై 1992 తో పూర్తవుతుంది. ఈ పీరియడ్ ఎట్మాస్పియర్లో షూటింగ్ చేస్తున్నాం. అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథా చిత్రం మా ఎర్రగుడి సినిమా. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కూడా షూటింగ్ చేయబోతున్నాం ” అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోరంట శ్రావణి మాట్లాడుతూ “మా ఎర్రగుడి సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరుగుతుంది డైరెక్టర్ సంజీవ్ గారు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తీస్తున్నారు ఈ సినిమా తర్వాత ఆయన కమర్షియల్ గా పెద్ద డైరెక్టర్ గా ఎదుగుతారు” అన్నారు

హీరో హీరోయిన్లు వెంకట్ కిరణ్,శ్రీజిత గోష్ మాట్లాడుతూ ” డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్స్. ఈ సినిమా మా కెరీర్ కి ఎంతో ఉపయోగపడుతుంది” అన్నారు.
జనవరి, ఫిబ్రవరి, మార్చి షెడ్యూల్స్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాత ఎం ఎస్ కే తెలిపారు.

నటీనటులు : వెంకట్ కిరణ్ శ్రీజిత ఘోష్.సత్య ప్రకాష్ ఆదిత్య ఓం, ఢిల్లీ రాజేశ్వరి, రఘుబాబు, అజయ్ గోష్ వనితారెడ్డి, జ్యోతి, శ్రావణి, శ్రీ కళ, చీరాల రాజేష్, రామ్ రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
సంగీతం: మాధవ్ సైబ, సుధాకర్ మారియో, రామసుధీ, సంజీవ్., సినిమాటోగ్రఫీ:ఎస్ ఎన్ హరీష్., ఆర్ట్: కెవి రమణ., ఫైట్స్: నటరాజ్., కొరియోగ్రఫీ: సూర్యకిరణ్., ఎడిటింగ్:ఆవుల వెంకటేష్., లైన్ ప్రొడ్యూసర్ :ఆర్. డి.ఎస్.. నిర్వహణ: ఘంటా శ్రీనివాసరావు., నిర్మాత: ఎం ఎస్ కె., రచన, దర్శకత్వం:సంజీవ్ కుమార్ మేగోటి.